E-Paper
Advertisement

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే
Advertisement

OTT Movie : ఒక భయంకరమైన హారర్ సినిమాని చాలా మందికి చూడాలని ఉంటుంది. దాదాపు రెండు గంటల పాటు కదలనీయ కుండా చేయడానికి, సినిమాలో కూడా ఏదో విశేషం ఉండాలి కదా మరి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ నలుగురు అమ్మాయిలు ఒక మంత్ర గత్తెను కలిసిన తర్వాత వాళ్ళ జీవితం గందరగోళం లో పడుతుంది. ఒక శాపం వాళ్ళను వెంటాడుతుంది. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి చుక్కలు కనడతాయి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘బెద్దుఆ: ది కర్స్’ (Beddua: The Curse ) ఇది 2018లో వచ్చిన టర్కిష్ హారర్ మూవీ. అల్పర్ మెస్ట్చి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో బేయ్జానుర్ మెటె, ఎస్మా సోయ్సల్, సెరిఫె ఉన్సల్, అయ్లా గిజెమ్ తక్మా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 జూన్ 15న టర్కీలో విడుదల అయింది. IMDb 5.9/10లో దీనికి రేటింగ్ ఉంది. ఇది టర్కిష్ “ఉచ్ హార్ఫిలర్” సిరీస్‌లో 4వ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

మెలెక్, బుర్కు, ఎడా, అయ్లా అనే నాలుగు అమ్మాయిలు, హై స్కూల్ నుంచి మంచి స్నేహితులుగా ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్లు మళ్లీ కలుస్తారు. కోడి రోజులు సరదాగా గడపాలని అనుకుంటారు. ఈ సమయంలో వాళ్లు హావెల్ అనే ఒక వింత మాంత్రికురాలిని కలుస్తారు. హావెల్‌తో మాట్లాడుతుండగా, అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది. కోపంతో హావెల్ వాళ్లపై ఒక శాపం పెడుతుంది. ఈ శాపం వల్ల వాళ్ల జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. వాళ్లకు భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. వాళ్ల స్నేహం కూడా గందరగోళంగా మారుతుంది.

Read Also : పెళ్లీడు పిల్లలుండగా పక్కింటి ఆంటీ ఇంట్లోకి… ఫైట్స్ లేవు, రొమాన్స్ లేదు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్

ఈ శాపం కారణంగా వీళ్ళ పరిస్థితి భయంకరంగా మారుతుంది. వాళ్లకు వింత శబ్దాలు వినిపిస్తాయి, భూతాలు కనిపిస్తాయి. రాత్రులు భయంతో గడుస్తాయి. శాపం వాళ్లను ఒకరినొకరు భయపెట్టేలా చేస్తుంది. వాళ్లు ఈ శాపం నుంచి బయటపడడానికి ట్రై చేస్తారు, కానీ శాపం మరింత బలంగా మారుతుంది. ఈ అమ్మాయిలు ఇప్పుడు ఆ శాపం వెనుక నిజం కనుక్కుంటారు. హావెల్ శాపం వాళ్లను శిక్షించడానికి పెట్టిందని తెలుస్తుంది. ఇక చేసేదేం లేక, వాళ్లు హావెల్‌ను మళ్లీ కలిసి, శాపం విరుగుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. హావెల్‌ వీళ్ళకు సహాయం చేస్తుందా ? వీళ్ళు శాపాన్ని తొలగించుకుంటారా ? అనే విషయాలను, ఈ హారర్ మూవీని చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×