// // Kaalipotka OTT : అనుమానాస్పద స్థితిలో భర్త మృతి... ట్విస్టులతో -->
E-Paper
Advertisement

Kaalipotka OTT : అనుమానాస్పద స్థితిలో భర్త మృతి… ట్విస్టులతో పిచ్చెక్కించే బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్

Kaalipotka OTT : అనుమానాస్పద స్థితిలో భర్త మృతి… ట్విస్టులతో పిచ్చెక్కించే బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Kaalipotka OTT : ఓటీటీలో ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతోంది. ప్రతి భాషలలో ఇలాంటి జోనర్లే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ప్రేక్షకులకు తగ్గట్టే మేకర్స్ కూడా ఇలాంటి సినిమాలు, సిరీస్ లను తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాలీ ఇండస్ట్రీ నుంచి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మరి కొన్ని గంటల్లో ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ఒక మర్డర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఆడియన్స్ ను అలరించబోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

అభిరూప్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘కాళీపొత్క’ (Kaalipotka)లో స్వస్తిక ముఖర్జీ, శృతి దాస్, మినోతి, హిమికా బోస్, అనిర్బన్ చక్రబర్తి లీడ్ రోల్స్ లో నటించారు. ఇది జనవరి 23న ZEE5లో విడుదల కానుంది. మీరు దీన్ని OTTplay ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో కూడా చూడవచ్చు. శ్రీమగా స్వస్తిక ముఖర్జీ, రాణిగా శృతి దాస్, మినోటిగా శ్రేయ భట్టాచార్య, రింకుగా హిమికా బోస్ మరియు రానాగా అనిర్బన్ చక్రబర్తి నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

శ్రీమా, రాణి, రింకూ, మినోటి అనే నలుగురి మహిళల చుట్టూ ఈ కథ తిఉగుతుంది. ఒక ప్రమాదంలో మినోటి భర్త మరణించిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కలుస్తారు. మినోటి భర్త మరణం తర్వాత, భయంతో వాళ్ళు ఆ మృతదేహాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారు ఒక అబద్ధం తర్వాత మరొక అబద్ధం ఆడుతూ చిక్కుల్లో పడతారు.ఒకవైపు పోలీసులు వారిని వెంబడిస్తుంటే, మరోవైపు రాణా (అనిర్బన్ చక్రవర్తి) అనే ఒక ప్రమాదకరమైన నేరస్థుడు వారిని వేటాడుతుంటాడు. అతనికి ఈ మహిళలతో పాత కక్షలు ఉండటం వల్ల కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. చివరి వరకు కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఇంతకీ మినోటి భర్త ఎలా చనిపోయాడు ? వీళ్ళంతా ఎందుకు ఆ శవాన్ని దాచాల్సి వచ్చింది ? ఈ సంఘటన నుంచి వీళ్ళంతా బయట పడతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకవాల్సిందే.

Read Also : ఏడేళ్ళ తర్వాత తమ్ముడి చావుకి రివేంజ్… అండర్ వరల్డ్‌లో అన్న అరాచకం… ఒక్కొక్కడికీ దబిడి దిబిడే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×