E-Paper
Advertisement

OTT Movie : భర్తకి అమ్మాయిని సెట్ చేసే భార్య… ఇదెక్కడి యవ్వారంరా సామీ

OTT Movie : భర్తకి అమ్మాయిని సెట్ చేసే భార్య… ఇదెక్కడి యవ్వారంరా సామీ
Advertisement

OTT Movie : ఓటిటిలోకి వస్తున్న సినిమాలలో మలయాళం సినిమాల తర్వాత అటువంటి కథలతో బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో సింపుల్ గా ఈ సినిమాలను ప్రజలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీలో టీచర్ స్టూడెంట్ ల ప్రేమ జీవితాలను మార్చేస్తుంది. ఈ డిఫరెంట్ కథతో వచ్చిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …

అడ్డా టైమ్స్ (Adda Times) లో

Advertisement

ఈ బెంగాలీ రొమాంటిక్ మూవీ పేరు ‘బసంత ఎసే గెచే’ (Basanta Ese Geche). 2024లో విడుదలైన ఈ బెంగాలీ మూవీకి అభిమన్యు ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ ప్రేమ ఆటలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ కథ ప్రేమ, అపార్థాలు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ, ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. ఇందులో స్వస్తికా దత్తా (చంద్రిమా), అర్పన్ ఘోషాల్ (నిషాన్), మరియు సాక్షి సాహా (తియాషా) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ బెంగాలీ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అడ్డా టైమ్స్ (AddaTimes) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే 

Advertisement

తియాషా ఒక టీనేజ్ ఇంజనీరింగ్ విద్యార్థిని, ఆమె తన జీవితాన్ని తన ఇష్టం ప్రకారం జీవిస్తూ ఉంటుడి. ఆమె తన కంటే చాలా పెద్దవాడైన తన లెక్కల టీచర్ నిషాన్‌పై ప్రేమలో పడుతుంది. తియాషా తన ప్రేమను ఒక లేఖ ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంటుంది. అతడు టీచ్ చేసే బుక్ లో లవ్ లెటర్ పెడుతుంది. మరోవైపు నిషాన్  వివాహం చేసుకుని సంతోషంగా తన భార్య చంద్రిమాతో సంతోషంగా జీవిస్తున్నాడు. తియాషా నుండి వచ్చిన ప్రేమ లేఖను అతను పెద్దగా పట్టించుకొడు. దానిని తన భార్య చంద్రిమాకు చూపించి నవ్వుకుంటాడు. నిషాన్ భార్య ఈ పరిస్థితిని ఒక ఆటగా తీసుకుని, తియాషాతో ఆడుకోవాలని అనుకుంటుంది. ఆమె నిషాన్‌ రాస్తున్నట్టుగా ఒక లవ్ లెటర్ రాసి తియాషాకు పంపుతుంది.   తియాషా కూడా నన్ను ఇష్టపడితే నీలం రంగు దుస్తులు ధరించమని చెప్తుంది. ఇది చదివిన భార్య నిషాన్‌ కు నీలం రంగు డ్రస్ వేస్తుంది. దీనితో తియాషా తన ప్రేమ స్వీకరించబడిందని తప్పుగా భావిస్తుంది. చంద్రిమా, తియాషా ప్రేమను పరీక్షించడానికి “FLAMES” అనే ఆట ఆడుతుంది నిషాన్ ఫోన్ ద్వారా తియాషాతో చాటింగ్ చేస్తుంది. నిషాన్ తనతో చాటింగ్ చేస్తున్నాడాని అనుకుంటుంది తియాషా. ఆతరువాత పరిస్తితి మారిపోతుంది. నిషాన్‌ కు విషయం తెలిసి భార్య పై కొప్పడతాడు. తియాషా ప్రేమని తిరస్కరిస్తాడు. అందుకు తియాషా నిషాన్‌పై కంప్లైంట్ ఇస్తుంది. తనపై అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి జైలుకు కూడా పంపిస్తుంది. చివరికి ఈ లవ్ స్టోరీ ఏమౌతుందో తెలుసుకోవాలి అనుకుంటే, ఈ  బెంగాలీ రొమాంటిక్ ‘బసంత ఎసే గెచే’ (Basanta Ese Geche) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×