E-Paper
Advertisement

Banned Movies on OTT: ఈ మూవీస్ కు ఇండియాలో నో ఎంట్రీ… కానీ ఇక్కడ చూడవచ్చు

Banned Movies on OTT: ఈ మూవీస్ కు ఇండియాలో నో ఎంట్రీ… కానీ ఇక్కడ చూడవచ్చు
Advertisement

Banned Movies on OTT: కొన్ని సినిమాలను మొదలు పెట్టినప్పటి నుంచే వివాదాల్లో చిక్కుకుంటాయి. ఆ కారణాల వల్ల కొన్నిసార్లు ఏకంగా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ముఖ్యంగా సాంస్కృతిక, మత, రాజకీయ కారణాలు ఇలా సినిమాలు బ్యాన్ అవ్వడానికి కారణం అవుతాయి. మరికొన్నిసార్లు ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉంటే సినిమాలను సెన్సార్ బోర్డు ఆపేస్తుంది. అలా బ్యాన్ అయిన సినిమాలు కొన్ని ఓటీటీలో మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇన్షా అల్లా ఫుట్బాల్

Advertisement

ఒక కాశ్మీరీ యువకుడు బ్రెజిల్ జట్టుకు ఫుట్బాల్ ఆట గాడిలా మారాలని కలలు కంటాడు. అతని తల్లితో పాటు పలు రాజకీయ కారణాల వల్ల అది నెరవేరకుండా పోతుంది. ఈ సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది.

వాటర్

Advertisement

1930లో భర్తలను కోల్పోయి విధవలుగా మారిన స్త్రీల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో గతంలో జరిగిన సతీసహగమనం వంటి దారుణమైన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ‘వాటర్’ సినిమాను యూట్యూబ్లో చూడొచ్చు.

అన్ ఫ్రీడం

ఈ సినిమా రెండు దేశాల్లో నడుస్తుంది. వేర్వేరు దేశాల్లో ఉండే వేరువేరు మనుషుల చుట్టూ నడుస్తుంది. అందులో ముస్లిం టెర్రరిస్టులు, లెస్బియన్ అమ్మాయికి బలవంతపు పెళ్లి నేపథ్యంలో నడిచే ఈ సినిమా నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది.

ఫర్జానియా

‘ఫర్జానియా’ సినిమా గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

గాండు

రీసెంట్ గా ‘మీర్జాపూర్’ సిరీస్ బూతుల కారణంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ ‘గాండు’ అనే సిరీస్ మాత్రం మితిమీరిన బూతుల కారణంగా థియేటర్లలో బ్యాన్ అయింది. కానీ ఎలాంటి సెన్సార్ లేకుండా నెట్ ఫిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

బాండిట్ క్వీన్

ఈ ‘బాండిట్ క్వీన్’ సినిమా బందిపోటు రాణి పూలన్ దేవి జీవితం ఆధారంగా రూపొందించారు. కానీ సినిమా పలు వివాదాల వల్ల థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమాను కావాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

లవ్

గే సెక్స్ కు సంబంధించిన కొన్ని సినిమాలను ప్రస్తుతం బాగానే చూస్తున్నారు జనాలు. కానీ 2017 లో వచ్చిన ‘లవ్’ సినిమాలు మాత్రం థియేటర్లలో చూసే ఛాన్స్ రాలేదు. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

బ్లాక్ ఫ్రైడే

ముంబైలో జరిగిన పేలుళ్ల చుట్టూ సాగే ఈ కథ పలు కారణాల వల్ల థియేటర్లకైతే రాలేదు. కాని హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ఫైర్

నందిత దాస్, షబానా అజ్మీ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీరిద్దరూ లెస్బియన్లుగా కనిపించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×