E-Paper
Advertisement

Bandwaale on OTT : షాలిని పాండే ‘బ్యాండ్ వాలే’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ ?

Bandwaale on OTT : షాలిని పాండే ‘బ్యాండ్ వాలే’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ ?
Advertisement

Bandwaale on OTT : ఓటీటీలలో ఎప్పటికప్పడు వచ్చే కొత్త సినిమాలు, సిరీస్ లపై ఆడియన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా అప్ కమింగ్ కంటెంట్ రిలీజ్ డేట్ ను ముందుగానే ప్రకటించి, ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకుంటాయి, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఇలాగే ఓ ఇంట్రెస్టింగ్ సినిమాను అనౌన్స్ చేసింది. అందులో ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ ఉండడం మరో విశేషం. మరి ఆ మూవీ సంగతులు ఏంటి? ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రైమ్ వీడియో తాజాగా ఒక కొత్త హిందీ సిరీస్‌ను ప్రకటించింది. ఆ మ్యూజికల్ డ్రామెడీ సిరీస్ పేరు ‘బ్యాండ్ వాలే’. సంగీతం, కామెడీ, ఎమోషన్స్ కలిసిన సరదా కథ ఇది. తాజా అనౌన్స్మెంట్ ప్రకారం ఈ సిరీస్ ను మరో మూడు రోజుల్లోనే చూడవచ్చు. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో జహాన్ కపూర్, షాలిని పాండే, స్వానంద్ కిర్కిరే నటిస్తున్నారు. ఇంకా సంజన దీపు, ఆశిష్ విద్యార్థి, అనుపమ కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్షత్ వర్మ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. 2026 ఫిబ్రవరి 13న ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రీమియర్ అవుతుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ రత్లాం అనే చిన్న పట్టణంలో సాగుతుంది. మరియం (జహాన్ కపూర్) అనే యువతి తన హృదయంలోని భావాలను కవితల రూపంలో ప్రపంచంతో పంచుకుంటుంది. ఆమె ఆన్‌లైన్‌ లో కౌసర్ మునీర్ పేరుతో తన కవితలు పోస్ట్ చేస్తుంది. ఆ కవితల్లో ఆమె సంకోచాలు, సందేహాలు, భావోద్వేగాలు బయటపడతాయి. మరియం తన సన్నిహిత స్నేహితులు, బ్యాండ్ సభ్యులతో కలిసి సరదాగా ఉంటుంది. వారిలో రోబో (స్వానంద్ కిర్కిరే), DJ సైకో ముఖ్యమైనవారు. వీళ్లందరూ కలిసి సంగీతంలో తేలిపోవడమే కాకుండా సంతోషంగా, స్నేహంతో లైఫ్ ను మరింత స్పెషల్ గా లీడ్ చేస్తారు. అయితే మరియం కవిత్వం ద్వారా తన అభిరుచిని పంచుకున్నప్పుడు, ఆమె స్నేహితుల క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. చిన్న చిన్న ఎంపికలు, బంధాలు ఆమెలో విశ్వాసాన్ని నింపుతాయి.

Also Read : శేటు బిడ్డతో యవ్వారం… చిన్న పిల్లలు చూడకూడని సిరీస్… కుర్రాళ్లకు మాత్రం కిక్కు పక్కా

Advertisement

వినడానికి సింపుల్ గా ఉన్న ఈ సిరీస్‌లో సంగీతం చాలా ముఖ్యం. యశ్‌రాజ్ ముఖతే దీనికి సంగీతాన్ని స్వరపరిచారు. ఈ పాటలు కథకు ఎమోషనల్ స్ట్రెంత్ ఇస్తాయి. మరియం ప్రయాణంతో సంగీతం బాగా ముడిపడి ఉంటుంది. స్వానంద్ కిర్కిరే ఈ సిరీస్‌కు కొ -క్రియేటర్ మాత్రమే కాదు సహ రచయిత కూడా. మరి ఈ సిరీస్ తో షాలిని పాండే ఆడియన్స్ మనసును ఎంత వరకు గెలుచుకుంటుందో చూడాలి. ‘అర్జున్ రెడ్డి’ తరువాత ఆమె నుంచి ఆశించిన రేంజ్ లో సినిమాలేమీ రాలేదు. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ఆ లోటును తీరుస్తుందా ? అన్నది చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×