E-Paper
Advertisement

Bahubali The Epic OTT: ఓటీటీలోకి బాహుబలి ది ఎపిక్.. ఎప్పుడు?ఎక్కడంటే?

Bahubali The Epic OTT: ఓటీటీలోకి బాహుబలి ది ఎపిక్.. ఎప్పుడు?ఎక్కడంటే?
Advertisement

Bahubali The Epic: రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన బాహుబలి(Bahubali) సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. పది సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను కూడా పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు . ఇక రాజమౌళి సైతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఓటీటీలోకి బాహుబలి ది ఎపిక్..

ఈ సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు అయిన నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల తిరిగి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా “బాహుబలి ది ఎపిక్ పేరిట” (Bahubali The Epic)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31వ తేదీ రీ రిలీజ్ అయ్యి ఏకంగా 53 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇలా రీ రిలీజ్ లోను రాజమౌళి సరికొత్త ట్రెండ్ సృష్టించారనే చెప్పాలి. ఇలా రెండు భాగాలు కలిపి థియేటర్లో ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో విడుదల కాబోతోంది అనే విషయానికి వస్తే..

నెట్ ఫ్లిక్స్ చేతికి బాహుబలి ది ఎపిక్..

Advertisement

బాహుబలి ది ఎపిక్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) భారీ ధరలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో అన్ని భాషలలోనూ ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చిత్ర బృందం ఇప్పటివరకు ఎక్కడ అధికారకంగా స్పందించలేదు త్వరలోనే ఈ విషయంపై అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నెట్ ఫ్లిక్స్ ఇదివరకే బాహుబలి సినిమాకు సంబంధించి రెండు భాగాలను కూడా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేశారు.

వారణాసి పనులలో రాజమౌళి..

Advertisement

ఇకపోతే ది ఎ పిక్ సినిమా విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ బాహుబలి సినిమాని తొలగించిన సంగతి తెలిసిందే. ఇలా నెట్ ఫ్లిక్స్ బాహుబలి సినిమాని తొలగించడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ సినిమా కాల పరిమితికి సంబంధించిన అగ్రిమెంట్ పూర్తి కావడంతోనే డిలీట్ చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి. త్వరలోనే ది ఎపిక్ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండగా రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో వారణాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Keerthy Suresh: 10 దోసెలు, ఇడ్లీలు తింటా..కీర్తి సురేష్ ఫిట్నెస్ సీక్రెస్ ఇదేనా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×