E-Paper
Advertisement

IMDbలో 8.5 రేటింగ్… ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ క్లైమాక్స్ చూస్తే బుర్ర తిరిగిపోద్ది భయ్యా

IMDbలో 8.5 రేటింగ్… ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ క్లైమాక్స్ చూస్తే బుర్ర తిరిగిపోద్ది భయ్యా
Advertisement

Ayali web series : ఈ రోజుల్లో OTTలో సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్‌ లకు భారీ డిమాండ్ ఉంది. అలాంటి ఒక అద్భుతమైన తమిళ సిరీసే ‘అయాలి’. స్కూల్ లో చదువుకునే అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు, గ్రామీణ సంప్రదాయాలు, మహిళా సాధికారత వంటి అంశాలను ఉత్కంఠభరితంగా చూపించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ స్టోరీ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటుంది. మరి కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

‘అయాలి’ కథ ఏమిటి ?

ఇక్కడ 500 ఏళ్లుగా ఒక కఠినమైన ఆచారం నడుస్తోంది. అమ్మాయిలు రజస్వల (ప్యూబర్టీ) అయిన వెంటనే చదువు మానేసి పెళ్లి చేసుకోవాలి. లేకపోతే గ్రామ దేవత ‘అయాలి’ ఆగ్రహించి ఊరంతా సర్వనాశనం చేస్తుందని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు.14 ఏళ్ల తమిళ అమ్మాయి సెల్వి (అభి నక్షత్ర) చాలా తెలివైన, ధైర్యవంతురాలైన అమ్మాయి. తన స్నేహితురాళ్లు రజస్వల అయ్యాక చదువు ఆపేసి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని బాధ పడటం చూసి ఆమెకు భయం పుడుతుంది. తాను ఎలాగైనా చదువుకుని డాక్టర్ కావాలని ఆమె గట్టి సంకల్పం చేసుకుంటుంది. గ్రామంలో ఇలా చదువుకోవడం అన్నది జరగని పని.

Advertisement

అయితే తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు సెల్వికి రుతుస్రావం మొదలవుతుంది. ఈ విషయం బయట పడితే తన చదువు ఆగిపోతుందని భయపడి, ఆమె ఈ రహస్యాన్ని తన తల్లితో సహా ఎవరికీ చెప్పకుండా దాచి పెడుతుంది. శారీరక ఇబ్బందులను ఒంటరిగా భరిస్తూ, అబ్బాయిలాగా ప్రవర్తించి అందరినీ మోసం చేస్తుంది. ఆమె కష్టపడి గ్రామ చరిత్రలోనే 10వ తరగతి చదివిన మొదటి అమ్మాయిగా నిలుస్తుంది. గ్రామంలోని ఆచారాలు, నియమాల వల్ల సెల్వి పడిన ఇబ్బందులు ఏంటి ? ఆ గ్రామంలో సెల్వి తెచ్చిన మార్పు ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే.

ఎందుకు చూడాలి?

‘అయాలి’ సిరీస్ కేవలం ఒక అమ్మాయి చదువు కోసం జరిగే పోరాటం కాదు. గ్రామీణ సమాజంలో ఇప్పటికీ ఉన్న సంప్రదాయాలు, మహిళల సాధికారత, ధైర్యం, ఆశలు వంటి అంశాలను ఉత్కంఠభరితంగా చూపించారు ఈ సిరీస్ లో. అభి నక్షత్ర నటన అద్భుతం. ZEE5లో తమిళ్‌తో పాటు ఇతర భాషల్లో సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూస్తే మన గ్రామాల్లో ఇంకా మారాల్సిన విషయాలు గుర్తు వస్తాయి. అదే సమయంలో ఒక చిన్న అమ్మాయి ధైర్యం మనల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా బడ్జెట్ పెద్దగా లేకపోయినా… కథలోని బలం, నటన, దర్శకత్వం దీన్ని స్పెషల్ చేశాయి.

IMDb రేటింగ్

Advertisement

ఐయండీబీలో 8.5 రేటింగ్‌ తో ఉన్న ఈ సిరీస్ ఆడియన్స్ మనసుల్లో మంచి స్థానం సంపాదించింది. జీ5లో తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×