E-Paper
Advertisement

OTT Movie : భర్త లేనప్పుడు సంగీతం వాయించే మాస్టారుతో… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో

OTT Movie : భర్త లేనప్పుడు సంగీతం వాయించే మాస్టారుతో… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో
Advertisement

OTT Movie : ఓటీటీలో పాత సినిమాల దగ్గర నుంచి, కొత్త సినిమాల వరకు ఆడియన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ఎలాంటి సినిమా అయినా ఒక్క క్లిక్ తో కళ్ల ముందు. వాలి పోతోంది. పాతికేళ్ళ క్రితం వచ్చిన ఒక మరాఠీ సినిమా, ఆసక్తికరమైన కథాంశంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో టబు లీడ్ రోల్ లో నటించారు. ఇది ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 2000 లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ మరాఠీ, బెస్ట్ డైరెక్టర్ (మహేష్ మంజ్రేకర్) గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అస్తిత్వ’ (Astitva) 2000లో వచ్చిన మరాఠీ సినిమా. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో టబు, సచిన్ ఖేడేకర్, మొహనిష్ బాహ్ల్, స్మితా జయకర్ నటించారు. ఈ సినిమా 2000 అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

అదితి ముంబైలో మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తుంటుంది. ఆమె భర్త శ్రీకాంత్ ప్రొఫెసర్ పని చేస్తుంటాడు. వాళ్లకు అనికేత్ అనే 25 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ల పెళ్లి జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంటుంది. అదితి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె గతంలో మల్హార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండేది. మల్హార్ చనిపోయిన తర్వాత శ్రీకాంత్ అదితిని పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ అదితి ఈ సీక్రెట్ గురించి ఎవరికీ చెప్పదు. ఇప్పుడు అదితి కొడుకు అనికేత్ తన ప్రియురాలు రేవతితో పెళ్లి ప్లాన్ చేస్తాడు. అనికేత్, రేవతి పెళ్లి ప్లాన్స్ జరుగుతున్నప్పుడు, శ్రీకాంత్‌కు అదితి గతం గురించి తెలుస్తుంది.

Read Also : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

Advertisement

మల్హార్ చనిపోయిన తర్వాత అతని రచనలు అమ్ముడై, ఆ డబ్బు అదితికి వచ్చినట్లు శ్రీకాంత్‌కు తెలుసుకంటాడు. అదితికి, మల్హార్‌కు సంబంధం ఉందని శ్రీకాంత్ కి అర్థమైపోతుంది. దీంతో అతను అదితితో గొడవ పడి, ఆమెను దూరం పెడతాడు. అదితి తన గతం దాచుకుని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ శ్రీకాంత్ ఆమెను అర్థం చేసుకోడు. మల్హార్‌ తో ఉన్నప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అనికేత్ వాస్తవంగా మల్హార్ కొడుకని భర్తతో చెప్పేస్తుంది. శ్రీకాంత్ ఈ విషయం విని షాక్ అవుతాడు. ఇక ఈ కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. దీంతో అదితితో శ్రీకాంత్ విడిపోతాడా ? కలసి కాపురం చేస్తాడా ? అనే విషయాలను, ఈ మరాఠీ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×