E-Paper
Advertisement

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు
Advertisement

OTT Movie : ఈ సినిమా బాలీవుడ్, వేశ్యాగృహాల చీకటి కోణాలను బ్లాక్ కామెడీ, వయోలెన్స్‌తో చూపిస్తుంది. ముంబైలో ఒక బాలీవుడ్ స్టార్, అతని డ్రైవర్, ఒక వేశ్య చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది. కొన్ని సీన్స్ మాత్రం పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

ముంబైలో కరణ్ అనే బాలీవుడ్ స్టార్ ఒక రాత్రి కాంత అనే వేశ్యను హైర్ చేసుకుంటాడు. కాంత, ఖుషియా అనే రౌడీ ఆధీనంలో ఉంటుంది. ఆమె జీవితం నరకంలా ఉంటుంది. కరణ్ డ్రైవర్ రాజు, కాంతతో ప్రేమలో పడతాడు. ఆమెను ఖుషియా నుండి తప్పించాలని అనుకుంటాడు. ఇదే సమయంలో కరణ్‌ని గోర్ధన్ అనే వ్యక్తి అతని గతంలోని ఒక సీక్రెట్‌తో బ్లాక్‌మెయిల్ చేస్తాడు. కరణ్ తన స్టార్ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు కాంత, రాజు ప్రేమ కథ ఒకవైపు, కరణ్ బ్లాక్‌మెయిల్ డ్రామా మరోవైపు ఆసక్తికరంగా నడుస్తాయి. ఖుషియా గర్ల్‌ఫ్రెండ్ లతిక, కాంతను వేధిస్తూ, కథలో ట్విస్ట్‌లు రివీల్ చేస్తుంది. ఇది కథను మరో లెవెల్ కి తీసుకెళ్తుంది.

Read Also : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

ఇక ఈ రెండు స్టోరీలూ – కాంత, రాజు ప్రేమ, కరణ్ బ్లాక్‌మెయిల్ – ఒకదానితో ఒకటి కలిసి, చివరకు వయోలెన్స్‌తో నిండిన క్లైమాక్స్‌కి దారితీస్తాయి. రాజు, కాంతను సేవ్ చేయడానికి ఖుషియాతో ఫైట్ చేస్తాడు. కానీ ఖుషియా సైకో నేచర్ వల్ల పరిస్థితి అదుపు తప్పుతుంది. కరణ్, తన సీక్రెట్ బయటకు రాకుండా గోర్ధన్‌ని డీల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది కూడా వయోలెంట్‌గా మారుతుంది. చివర్లో ఈ రెండు ఈవెంట్స్ కలిసి ఒక షాకింగ్ ఎండింగ్‌కి వస్తాయి. ఈ ఎండింగ్ ను మీరు కూడా చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Advertisement

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘అశ్చర్యచకిత్!’ (Ascharyachakit) సమిత్ కక్కడ్ డైరెక్ట్ చేసిన హిందీ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా. ఇందులో ప్రియాంక బోస్ (కాంత), వైభవ్ రాజ్ గుప్తా (రాజు), అంకిత్ రాజ్ (కరణ్), అనంగ్ష బిస్వాస్ (లతిక), సంతోష్ జువేకర్ (ఖుషియా) మెయిన్ రోల్స్‌లో ఉన్నారు. Netflixలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 1 గంట 30 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.9/10 రేటింగ్ ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×