E-Paper
Advertisement

OTT Move : చచ్చినోడు చేసే హత్యలు… అంతుపట్టని కేసు… బుర్రకు పదును పెట్టే తమిళ థ్రిల్లర్

OTT Move : చచ్చినోడు చేసే హత్యలు… అంతుపట్టని కేసు… బుర్రకు పదును పెట్టే తమిళ థ్రిల్లర్
Advertisement

OTT Move : మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చే సస్పెన్స్ సినిమాలు ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఇలాంటి సినిమాలను వదలకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. రీసెంట్ గా ఒక తమిళ థ్రిల్లర్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో చచ్చిపోయినా కూడా ఒక మనిషి ఎంత డేంజర్ అవుతాడో చూపిస్తుంది. ఒక రైటర్ తాను చనిపోయాక ఐదు మందిని చంపుతానని ఓపెన్ ఛాలెంజ్ చేసి సూసైడ్ చేసుకుంటాడు. ఆ తరువాత కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఇందులో క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ పక్కాగా ఉంటుంది. మరి కొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆర్యన్’. ప్రవీణ్. K దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయింది. నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇది తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అత్రేయ అనే ఒక రైటర్, ఒక లైవ్ టీవీ షోలో ఒక్కసారిగా నేను ఈ దేశంలో ఎవరూ ఆపలేని పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తా… 5 రోజుల్లో 5 మందిని చంపేస్తా అని అనౌన్స్ చేసి, అక్కడే తన గొంతు కోసేసుకుని సూసైడ్ చేసుకుంటాడు. అతను చనిపోయాడు కదా, ఇంకెలా చంపుతాడు? అని అందరూ షాక్ అవుతారు. కానీ మరుసటి రోజు ఉదయం ఒక పెద్ద పాలిటీషియన్ ఇంట్లోనే డెడ్ బాడీగా దొరుకుతాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్ గందరగోళంలో పడుతుంది. ఇన్‌స్పెక్టర్ నంది ఈ కేసు తీసుకుని అత్రేయ ఇంటికి వెళ్తే… అక్కడ ఒక డైరీ, ల్యాప్‌టాప్, వీడియోలు దొరుకుతాయి. వీడియోలో అత్రేయ నవ్వుతూ నేను చనిపోయినా నా ప్లాన్ ఆగదు, ప్రతి రోజు ఉదయం 9 గంటలకి నెక్స్ట్ విక్టిమ్ పేరు టీవీలో వస్తుందని చెప్తాడు.

Read Also : హ్యాండ్సమ్ భర్త… క్యూట్ పెళ్ళాం… మధ్యలో అందంతో మత్తెక్కించే ప్రియురాలు… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లే

Advertisement

నిజంగానే మరుసటి రోజు ఒక బిజినెస్ మ్యాన్ చనిపోయినట్లు వస్తుంది. నంది టీమ్‌తో కలిసి రోజుకో మర్డర్ ఆపడానికి పడిగాపులు కడతాడు. కానీ అత్రేయ ప్లాన్ భయంకరంగా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాప్స్, రిమోట్ కంట్రోల్ పాయిజన్స్ తో ఎంత గట్టిగా కాపలా ఉంచినా విక్టిమ్స్ ఒక్కొక్కరుగా చనిపోతూనే ఉంటారు. నంది అత్రేయ డైరీ చదివినప్పుడు అసలు నిజం తెలుసుకుంటాడు. అత్రేయ లైఫ్‌లో ఈ 5 మంది అతన్ని బాగా అవమానించారు, కెరీర్ నాశనం చేశారు. అందుకే రివెంజ్ కోసం చనిపోయే ముందు పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసి చనిపోయాడు. ఈ మరణాలలో నంది ఒక్క ప్రాణానాన్నయినా కాపాడుతాడా ? అందరూ చచ్చిపోతారా ? అనే విషయాలను, ఈ తమిళ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×