E-Paper
Advertisement

Apple TV 2026 Release : ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ వరకు… 2026లో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు

Apple TV 2026 Release : ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ వరకు… 2026లో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు
Advertisement

Apple TV 2026 Release : ఈ ఏడాది ఆపిల్ టివిలో సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లు విడుదల కానున్నాయి. ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గో గాట్ మనీ ట్రబుల్స్’ వరకు, ఆపిల్ టీవీలో అనేక ఇంట్రెస్టింగ్ కొత్త సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వాటిని మనం ఎప్పుడు చూడగలమో తెలుసుకుందాం.

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (Monarch: Legacy Of Monsters)

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 త్వరలో రాబోతోంది. మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కొత్త సీజన్ ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ కానుంది. 10 ఎపిసోడ్‌లతో ఈసారి, కొత్త మాన్స్టర్స్ ని కథలో పరిచయం చేయనుంది. గాడ్జిల్లా, కాంగ్ రెండింటికీ ముప్పు కలిగించే ‘టైటాన్ ఎక్స్’ అనే కొత్త సముద్ర జీవిని ఇందులో చూపించనున్నారు.

ఇంపర్ఫెక్ట్ ఉమెన్ (Imperfect Women)

Advertisement

ఇది మార్చి 18న విడుదల కానుంది. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అరమింటా హాల్ రాసిన 2020 నవల ఆధారంగా రూపొందింది. ఈ కథ ముగ్గురు మహిళల స్నేహం చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు అనుకోకుండా చేసే ఒక క్రైమ్ తో కథ ఉంటుంది. దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. ఇందులో ఎలిజబెత్ మోస్, కెర్రీ వాషింగ్టన్, కేట్ మారా నటించారు.

ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్ (For All Mankind)

సీజన్ 5 మార్చి 27న ప్రీమియర్ కానుంది. ఇది 10-ఎపిసోడ్‌ల సీజన్, ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌లు విడుదలవుతాయి. చివరి ఎపిసోడ్ 2026 మే 29న ప్రసారం అవుతుంది. పాత నటులు ఇందులో తిరిగి నటిస్తున్నారు. కొత్తగా చేరిన వారిలో మిరెయిల్ ఎనోస్, కోస్టా రోనిన్, సీన్ కౌఫ్‌మాన్ ఉన్నారు.

మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్ (Margo’s got money troubles)

Advertisement

ఇది ఈ ఏడాది ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఈ సిరీస్ రూఫీ థోర్ప్ రాసిన 2024 నవల ఆధారంగా రూపొందింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 20 ఏళ్ల మార్గో మిల్లెట్ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఇందులో ఎల్లే ఫానింగ్, మిచెల్ ఫైఫర్, నిక్ ఆఫర్‌మాన్, నికోల్ కిడ్‌మాన్ నటించారు.

క్రిమినల్ రికార్డ్ (Criminal Record)

‘క్రిమినల్ రికార్డ్’ సీజన్ 2 ఏప్రిల్ 22న వస్తుంది. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో పీటర్ కాపాల్డి, కుష్ జుంబో మునుపటి పాత్రల్లో నటించారు. ఈ సీజన్‌లో డిటెక్టివ్ సార్జెంట్ జూన్ లెంకర్ (జుంబో) డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ డేనియల్ హెగార్టీ (కాపాల్డి) నటించారు.

విడోస్ బే (Widow’s Bay)

ఈ హారర్ కామెడీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది. ఈ సిరీస్ లో కేట్ ఓ’ఫ్లిన్, స్టీఫెన్ రూట్, కింగ్‌స్టన్ రూమి సౌత్‌విక్, కెవిన్ కారోల్, డేల్ డిక్కీ నటించారు. ఈ కథ న్యూ ఇంగ్లాండ్ తీరానికి 40 మైళ్ల దూరంలో ఉన్న ఒక ద్వీపంలో సెట్ చేయబడింది.

Read Also : ఇన్వెస్టిగేషన్ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా వరకు… అద్భుతమైన లేడి ఓరియెంటెడ్ సినిమాలు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×