E-Paper
Advertisement

OTT Movie : కొత్తగా పెళ్లి… అంతలోనే పిల్లలు కావాలంటూ ఊహించని పని… ఓటీటీలో అదరగొడుతున్న మలయాళ మూవీ

OTT Movie : కొత్తగా పెళ్లి… అంతలోనే పిల్లలు కావాలంటూ ఊహించని పని… ఓటీటీలో అదరగొడుతున్న మలయాళ మూవీ
Advertisement

OTT Movie : ప్రతీ ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు ఉంటాయి. అయితే వాటిని తెరపై మనసుకు హత్తుకునే విధంగా అందించే డైరెక్టర్ ఉంటే, ఫ్యామిలీ ఎంటర్టైనర్లను చూడడానికి థియేటర్లకు జనాలు పరుగులు తీయడం ఖాయమని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. మరి ఓటీటీలో కూడా ఇలాంటి సినిమాల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే. అది కూడా మలయాళ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లి, అంతలోనే పిల్లల గొడవ… ఆ తరువాత కథ ఏమైందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…
కథ కేరళలోని కన్నూర్‌లోని ఒక గ్రామంలో నడుస్తుంది. నకులన్ (అర్జున్ అశోకన్), ఒక లాటరైట్ స్టోన్ క్వారీ వ్యాపారి. శాలిని (అనఘ నారాయణన్)తో అతనికి పెళ్లవుతుంది. ఈ కొత్త జంట వైవాహిక జీవితం ప్రారంభంలో సంతోషంగా, పరస్పర అవగాహనతో నడుస్తుంది. అయితే కొన్ని నెలల్లోనే పరిస్థితులు తారుమారు అవుతాయి. ఇలా పెళ్లి అయ్యిందో లేదో అలా నస మొదలవుతుంది. కుటుంబ సభ్యులు నుంచి మొదలు పెడితే గ్రామస్థుల వరకు ప్రతి ఒక్కరూ “శుభవార్త ఎప్పుడు?” అనే ప్రశ్నతో ఈ జంటను వేధిస్తారు. ముఖ్యంగా శాలిని పిల్లల గురించి ఎదురవుతున్న ఒత్తిడితో సతమతమవుతుంది. ఈ ఒత్తిడి శాలిని మనస్తత్వంపై ప్రభావం చూపుతుంది. ఇంకేముంది ఆమె ఆనందం క్రమంగా నిరాశ, కోపంగా మారుతుంది. ఒక బంధువుతో జరిగిన వాగ్వాదం కథలో కీలక మలుపును తెస్తుంది, ఇది శాలిని, నకులన్‌ల జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఆ మార్పు ఏంటి? ఈ పిల్లల గోలకు వాళ్ళు ఎలా ఫుల్ స్టాప్ పెట్టారు? క్లైమాక్స్ ఏంటి? అన్న విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా పేరు ‘అన్పోడు కన్మణి’ (Anpodu Kanmani). లిజు థామస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్, అనఘ నారాయణన్ ప్రధాన పాత్రలలో నటించారు. విపిన్ పవిత్రన్ నిర్మించిన ఈ మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మాక్స్ (Manorama Max) ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ ఏడాది మార్చి 26 న థియేటర్లలోకి వచ్చిన ఈ మలయాళ మూవీకి బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×