E-Paper
Advertisement

ఇంట్లో భర్త అనుమానాస్పద మృతి… అడ్డంగా ఇరుక్కునే భార్య

ఇంట్లో భర్త అనుమానాస్పద మృతి… అడ్డంగా ఇరుక్కునే భార్య
Advertisement

Thriller Movie : హత్యా ? ఆత్మహత్యా ? లేదా ఇంకా ఏదైనా రహస్యమా ? ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తే క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫ్రెంచ్ లీగల్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ (Anatomy of a Fall). ఈ మూవీకి ఉత్తమ అసలైన స్క్రీన్‌ప్లే కేటగిరీలో అవార్డు దక్కింది. జస్టిన్ ట్రియెట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం ఒక హత్య కేసు చుట్టూ కాకుండా, భార్యాభర్తల మధ్య ఉన్న సంక్లిష్టమైన బంధం, అసూయ, ఈగో క్లాష్‌లు, గత గాయాలు, న్యాయ వ్యవస్థ లోపాలు వంటి అంశాలతో రూపొందించారు. సాండ్రా హుల్లర్ అద్భుత నటనతో ఈ సినిమా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. మరి మూవీ కథ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథా నేపథ్యం అంతా జర్మనీకి చెందిన సాండ్రా వోయ్టర్ (సాండ్రా హుల్లర్) ఒక విజయవంతమైన నవల రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఫ్రెంచ్ భర్త శ్యామ్యూల్ మాలెస్కీ, 11 ఏళ్ల పాక్షిక అంధుడైన కొడుకు డానియెల్తో కలిసి ఫ్రాన్స్‌లోని అందమైన మంచు కొండల మధ్య ఒంటరి బంగళాలో జీవితం సాగిస్తుంటుంది. శ్యామ్యూల్ కూడా రచయితగా ఎదగాలని కలలు కంటాడు, కానీ సాండ్రా విజయం అతనిలో అసూయను రెచ్చగొడుతుంది. ఈ నేపథ్యంలోనే ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది.

Advertisement

ఒకరోజు కొడుకు డానియెల్ తన పెంపుడు కుక్కతో బయటకు వాకింగ్‌కు వెళ్లి వచ్చేసరికి, తండ్రి శ్యామ్యూల్ ఇంటి మూడవ అంతస్తు కిటికీ నుంచి కిందపడి, మంచులో రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు. ఆ సమయంలో ఇంట్లో సాండ్రా ఒక్కటే ఉంటుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ లో ఇది ప్రమాదం కాదని, తలపై బలమైన గాయం ఉందని తేలుతుంది. పోలీసులు సాండ్రాను ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తారు.

ఇక్కడి నుంచి సినిమా కోర్టు రూమ్ డ్రామాగా సాగుతుంది. ఇది కేవలం ఆధారాల విచారణ కాకుండా, భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలు, ఈగో సమస్యలు, వృత్తి అసూయలను కళ్ళకు కడుతుంది. విచారణలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదం వల్ల కొడుకు చూపు కోల్పోవడం, శ్యామ్యూల్ డిప్రెషన్‌లో మునిగిపోవడం, సాండ్రా విజయం సాధించడం వల్ల భర్తలో కలిగిన అసూయ, హత్యకు ఒకరోజు ముందు వారిద్దరి మధ్య జరిగిన తీవ్రమైన గొడవ ఆడియో రికార్డింగ్ వంటివి బయటకు వస్తాయి. కొడుకు డానియెల్ ఒక్కడే ఇందులో కీలక సాక్షి. తన తల్లి నిజంగా తండ్రిని చంపిందా ? లేదా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడా ? చివరికి ఏమైంది ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

సాండ్రా హుల్లర్ తన అద్భుత నటనతో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మిలో మాచ్‌కావిచ్ (డానియెల్) పాక్షిక అంధుడైన కొడుకు పాత్రలో చాలా సహజంగా నటించాడు. దర్శకుడు జస్టిన్ ట్రియెట్ కోర్టు సన్నివేశాలను చాలా రియలిస్టిక్‌గా, ఉద్వేగభరితంగా తీశారు. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ కూడా అద్భుతం.ఈ మూవీ Amazon Prime Video, JioHotstarలో అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×