E-Paper
Advertisement

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా
Advertisement

OTT Movie : గోదావరి జిల్లాల పేర్లు వినబడగానే ఒక రకమైన పులకింత వస్తుంది. ఆ మర్యాదలు, పలకరింపులు అబ్బో ఒకటేమిటి చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు వెబ్ సిరీస్ ను ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. గోదావరి ప్రాంత కుటుంబాల సంస్కృతి గొడవలు, ప్రేమ గురించి ఈ సిరీస్ చక్కగా చూపిస్తుంది. ఈ కథ ఈస్ట్ గోదావరి అబ్బాయికి, వెస్ట్ గోదావరి అమ్మాయికి పెళ్లి జరిగాక స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. కామెడీ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ ను చూస్తే, ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘అనందలహరి’ (Anandalahari) 2025లో వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. సాయి వనపల్లి దర్శకత్వంలో అభిషేక్ బొద్దెపల్లి, బ్రమరాంబిక తూతిక, కృష్ణ యెరుబ్బని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 8 ఎపిసోడ్‌లతో, IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది. 2025 అక్టోబర్ 17 నుంచి Aha ఓటీటీలో విడుదల అయింది.

కథలోకి వెళ్తే

Advertisement

అనంద్ వెస్ట్ గోదావరి లో సరదాగా సమయం గడుపుతుంటాడు. అతని తండ్రి ఒక సర్పంచ కావడంతో తండ్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుతుంటాడు. మరో వైపు లహరి అనే ఈస్ట్ గోదావరి అమ్మాయి, సిటీలో మంచి జాబ్ కోసం ఎదురుచూస్తుంటుంది. వీళ్లిద్దరూ వేర్వేరు బ్యాక్‌ గ్రౌండ్‌ల నుంచి వచ్చినా, కథ పూర్తిగా మారిపోతుంది. అనంద్ కి పెళ్లి ప్రయాయత్నాల్లో భాగంగా లహరితో సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. అయితే లహరికి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మొత్తానికి వీళ్ళ పెళ్లి అనేక ట్విస్టులతో జరిగిపోతుంది. ఇక మకాం సిటీకి కూడా మారుస్తారు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది.

Read Also : ఆకాశంలో విహారయాత్ర… పైప్రాణాలు పైకే పోయే ఆపద… తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

లహరి తన చదువుకు తగ్గట్టు జాబ్ ని సంపాదిస్తుంది. అనంద్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఏ పని పాటా లేకుండా బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఇక డబ్బుల కోసం ఇంట్లోనే దొంగతనాలు కూడా చేస్తాడు. స్టోరీ కామెడిగా నడిచినా, ఆ తరువాత సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలు ఎలా ఉంటాయి ? వీళ్ళు వీటిని పరిస్కరించుకుంటారా ? వీళ్ళ కాపురం సజావుగా సాగుతుందా ? అనే విషయాలను, ఈ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×