E-Paper
Advertisement

Anaganaga oka Raju: అనగనగా ఒక రాజు ఓటీటీ,టీవీ పార్టనర్ ఫిక్స్!

Anaganaga oka Raju: అనగనగా ఒక రాజు ఓటీటీ,టీవీ పార్టనర్ ఫిక్స్!
Advertisement

Anaganaga oka Raju:చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రముఖ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty). ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈయన ఆ తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ ప్రకటిస్తారనుకున్నారు. కానీ యాక్సిడెంట్ కావడంతో అమెరికాలోనే కొన్ని రోజులు ఉండి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలోనే కథలపై దృష్టి సారించిన హీరో నవీన్ పోలిశెట్టి అందులో భాగంగానే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని ఫైనల్ చేసి.. ఇప్పుడు మన ముందుకు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు అనగా జనవరి 14న ఉదయం 8 గంటలకు థియేటర్లలోకి వచ్చేసింది ఈ సినిమా.

ఓటీటీ,టీవీ పార్టనర్ ఫిక్స్!

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ, టీవీ పార్టనర్ ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మూవీ ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అలాగే సాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఓటీటీ, టీవీ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తుంది ? అనే విషయాన్నికొస్తే.. ఈరోజు సినిమా ఫలితాన్ని బట్టి ఒకవేళ ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే థియేటర్లలోకి వచ్చిన నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక డిజిటల్ , సాటిలైట్ స్ట్రీమింగ్ కి చిత్ర బృందంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

ALSO READ:Karate Kalyani: అన్వేష్ పై మరోసారి ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఈసారి గట్టి దెబ్బే!

అనగనగా ఒక రాజు సినిమా విశేషాలు..

అనగనగా ఒక రాజు సినిమా విషయానికొస్తే.. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. నిజానికి ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్గా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అతని స్థానంలో మిక్కీ జే మేయర్ వచ్చారు. ఇక 2023లో నిర్మాతలకు, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కి సృజనాత్మక విభేదాలు రావడం వల్లే కళ్యాణ్ శంకర్ ను తప్పించి ఆస్థానంలో మారి(Maari)ని తీసుకొచ్చారు. పైగా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుందని అనుకున్నారు. కానీ మీనాక్షి చౌదరి రంగంలోకి దిగింది. ఇలా పలు పాత్రలను రీప్లేస్ చేసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ..

Advertisement

ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్లు పడ్డాయి. ఇక సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కామెడీ ప్రధానంగా బేస్ చేసుకుని సినిమాలు చేసే నవీన్ పోలిశెట్టి ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకర్షించారు అని కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నవీన్ తన కామెడీతో నవ్వులు పూయించాడని, కథ కంటే కామెడీకే ప్రధాన్యత ఇస్తూ తీసిన సినిమా ఇది అని, ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీతో పొట్ట చెక్కలవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సంక్రాంతి పండక్కి అసలైన కామెడీ ఎంటర్టైన్మెంట్ అని కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×