E-Paper
Advertisement

Our Fault Trailer : అమెజాన్ లో అరాచకం సృష్టించిన అడ*ల్ట్ మూవీ పార్ట్ 3 రెడీ… ట్రైలర్ లోనే అంతా చూపించారే

Our Fault Trailer : అమెజాన్ లో అరాచకం సృష్టించిన అడ*ల్ట్ మూవీ పార్ట్ 3 రెడీ… ట్రైలర్ లోనే అంతా చూపించారే
Advertisement

Our Fault Trailer : ‘అవర్ ఫాల్ట్’ 2025లో విడుదలయ్యే రొమాంటిక్ సినిమా. ఇది మెర్సెడెస్ రాన్ రాసిన “కల్పబుల్స్” (Culpables) పుస్తక ట్రైలజీలో మూడవ, చివరి భాగం. మొదటి చిత్రం “మై ఫాల్ట్” (2023), రెండవది “యువర్ ఫాల్ట్” (2024). ఈ ఫ్రాంచైజీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్లోబల్ హిట్ అయింది. ముఖ్యంగా యంగ్ అ*డల్ట్ ఆడియన్స్ ని ఈ తెగ అలరిస్తున్నాయి. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లోకి వచ్చి, ప్రైమ్ వీడియోలో అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ ఒరిజినల్ గా నిలిచింది. మూడవ చిత్రంగా ‘అవర్ ఫాల్ట్’ (Our Fault) రాబోతోంది. డొమింగో గాంజాలెజ్ దీనికి దర్శకత్వం వహించారు. మొదటి రెండు చిత్రాలకు కూడా అతనే దర్శకత్వం వహించాడు. పోకీప్సీ ఫిల్మ్స్, అమెజాన్ MGM స్టూడియోస్ దీనిని నిర్మించాయి. ఇందులో నికోల్ వాలెస్, గాబ్రియల్ గ్వేవారా ప్రధాన పాత్రల్లో నటించారు. గాబ్రియేలా అండ్రడా, మార్టా హాజాస్, ఫ్రాన్ మోర్సిల్లో, ఇవాన్ సాన్చెజ్, మార్టా హాజాస్ మిగతా పాత్రలు పోషించారు.

ప్లాట్ ఏమిటంటే?

నోహా, నిక్ విడిపోయిన తర్వాత 4 సంవత్సరాలకు… జెన్నా, లయన్ పెళ్ళిలో మళ్లీ కలుస్తారు. ఇక వీళ్ళు ప్రేమతో మళ్ళీ కలుస్తారా ? లేక విడిపోతారా ? అనేది కథ ముఖ్య భాగం. ఈ రొమాంటిక్ డ్రామా 2025 అక్టోబర్ 16న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

Advertisement

Read Also : బాయ్ ఫ్రెండ్ తో రాత్రి బర్త్ డే పార్టీ… కళ్ళు తెరిచి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… భయాన్నే భయపెట్టే హర్రర్ మూవీ

ట్రైలర్ ఎలా ఉందంటే ?

‘అవర్ ఫాల్ట్’ అధికారిక టీజర్ ఏప్రిల్ 2025లో విడుదలైంది. తాజాగా రిలీజయిన ట్రైలర్ డ్రామాటిక్‌గా, ఎమోషనల్‌గా ఉంది. నోహా, నిక్ మధ్య టెన్షన్, పెళ్లి సీన్స్, పాత గాయాలు, ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించడం వంటి సీన్స్ అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా సింగిల్స్ కు కావాల్సిన మసాలా ఎప్పటిలాగే స్ట్రాంగ్ గా ఉందనే విషయాన్ని మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేలోపు మొదటి రెండు పార్ట్స్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి, వెంటనే ఓ లుక్కెయ్యండి. అయితే ఆ రెండు పార్ట్స్ తో పాటు త్వరలో రిలీజ్ కానున్న మూడవ పార్ట్ కూడా పెద్దలకు మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఈ ఫ్రాంచైజీలో ఇదే ఫైనల్ చాప్టర్ అన్న విషయాన్ని మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు. కాబట్టి ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారు డోంట్ మిస్.

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×