E-Paper
Advertisement

All We Imagine As Light : ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’… ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

All We Imagine As Light : ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’… ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Advertisement

All We Imagine As Light : కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సత్తా చాటిన భారతీయ సినిమా ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine As Light) ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

ప్రముఖ ఇండియన్ లేడీ డైరెక్టర్ పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine As Light). అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులను గెలుచుకున్న ఈ మూవీ తాజాగా ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమాలో కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రను పోషించారు. దర్శకురాలు పాయల్ కపాడియా విభిన్నమైన కథతో డ్రామా ఫిలింగా దీన్ని తీర్చిదిద్దారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ ఫీచర్ ఫిలిం కూడా ఇదే.

Advertisement

ఇటీవల 82వ గోల్డెన్ క్లోబ్స్ పురస్కారాలకు ఈ సినిమా నామినేట్ అయింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా సత్తా చాటింది. ఈ ఏడాది జరిగిన 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ఫిక్స్ అవార్డును సొంతం చేసుకుంది ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ మూవీ. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి కేన్స్ లో ఈ గౌరవం దక్కడం విశేషం.

అంతేకాకుండా ఈ సినిమాను ఇప్పటికే వీక్షించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine As Light) మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పైగా ఈ ఏడాది తనకి నచ్చిన సినిమాలలో ఈ మూవీని ఫస్ట్ ప్లేస్ లో ఉంచి, చూడమంటూ సజెస్ట్ కూడా చేశారు. ఇలా ఇంటర్నేషనల్ రేంజ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

Advertisement

తాజాగా ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి జనవరి 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. దీంతో ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటిటి మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine As Light) మూవీ విషయానికి వస్తే… ముంబై నర్సింగ్ హోమ్ లో పని చేసే ఇద్దరు కేరళ నర్సుల కథ ఇది. ఈ నర్సులు ఇద్దరూ కలిసి బీచ్ టౌన్ లో ఉన్న ఓ రోడ్ ట్రిప్పుకు వెళ్తారు. ఆ తర్వాత వీరి జీవితాల్లో ఏం జరిగింది? అన్నదే ఈ మూవీ స్టోరీ.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×