E-Paper
Advertisement

44 ఏళ్ల తరువాత ఓటీటీలోకి వస్తున్న కమల్ శ్రీదేవి బ్లాక్ బస్టర్ సినిమా..వారికి నిరాశ తప్పదా?

44 ఏళ్ల తరువాత ఓటీటీలోకి వస్తున్న కమల్ శ్రీదేవి బ్లాక్ బస్టర్ సినిమా..వారికి నిరాశ తప్పదా?
Advertisement

Moondram Pirai OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే 28 రోజుల వ్యవధిలోనే తిరిగి ఆ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 44 సంవత్సరాలు తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో కమల్ హాసన్(Kamal Hassan) శ్రీదేవి(Sridevi) జంట ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

44 ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్న మూండ్రం పిరై..

బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం మూండ్రం పిరై (Moondram Pirai) . ఈ సినిమా తెలుగులో వసంత కోకిల అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.1982 లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో తెలుగు తమిళ భాషలలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన 44 సంవత్సరాలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతున్నట్లు తాజాగా సత్యజ్యోతి ఫిల్మ్స్ వారు అధికారకంగా వెల్లడించారు.

అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి..

Advertisement

నేటి తరానికి అనుగుణంగా ఈ సినిమాలో మార్పులు చేసి ఈ అద్భుతమైన కావ్యాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులోకి రాబోతుందని తెలియజేయడంతో తెలుగు అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి ఈ సినిమా తమిళంలో అమెజాన్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ సినిమా కేవలం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రాబోతుందని ప్రకటించడంతో అభిమానులు కాస్త నిరోత్సాహం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో అయినా తెలుగులో విడుదల చేస్తారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు..

Advertisement

ఇక ఈ సినిమా అప్పట్లో తెలుగు తమిళ భాషలలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. దర్శకుడు బాలు మహేంద్ర సైతం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్నారు.ఒక సామాన్య ఉపాధ్యాయుడు (చీను), మానసిక స్థితి సరిగ్గా లేని యువతి (భాగ్యలక్ష్మి) మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాల ప్రయాణమే ఈ సినిమా కథ అని చెప్పాలి. మరి 44 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి ఆదరణను సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన పుష్ప నటుడు.. ధన్యత బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×