E-Paper
Advertisement

Adventure Drama OTT : పిల్ల బచ్చాకు సూపర్ పవర్స్… ఇన్నాళ్ళూ ఈ మూవీని ఎలా మిస్ అయ్యాం మావా

Adventure Drama OTT : పిల్ల బచ్చాకు సూపర్ పవర్స్… ఇన్నాళ్ళూ ఈ మూవీని ఎలా మిస్ అయ్యాం మావా
Advertisement

Adventure Drama OTT : పిల్లల కోసం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. ఆయితే సూపర్ హీరో సినిమాలను పిల్లలు ఇష్టంగా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పూర్తిగా పిల్లలను ఉద్దేశించి తీశారు. ఈ సినిమాను స్పైడర్ మ్యాన్ కథకు చిన్న పిల్లల వెర్షన్‌గా చప్పుకోవచ్చు. ఇంత వరకు మూడు పార్ట్ లుగా వచ్చిన ఈ సినిమా పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివర్లలోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ డానిష్ సూపర్ హీరో చిత్రం పేరు ‘యాంట్ బాయ్’ (Antboy). 2013లో విడుదలైన ఈ సినిమా కెన్నెత్ బోగ్ ఆండర్సన్ రాసిన కామిక్ పుస్తకాల ఆధారంగా రూపొందింది. ఇందులో ఆస్కార్ డైట్జ్: యాంట్ బాయ్ పాత్రలో నటించాడు. ఆస్క్ హాసెల్‌బాచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డానిష్ భాషలో ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేయబడింది. ఆపిల్ టీవీ ప్లాట్‌ ఫామ్‌ లో ఇది అందుబాటులో ఉంది. ఈ సినిమా విజయవంతం కావడంతో Antboy: Revenge of the Red Fury (2014), Antboy 3 (2016) అనే రెండు సీక్వెల్స్ కూడా విడుదలయ్యాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పెల్లె నోర్మాన్ అనే 12 ఏళ్ల బాలుడు డెన్మార్క్‌లోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్కూల్లో ఎవరూ అతన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. ఒకరోజు స్కూల్ లో అతన్ని అల్లరి పిల్లలు ఏడిపిస్తుంటారు. ఆ పిల్ల రౌడీల నుండి తప్పించుకోవడానికి పెల్లె ఒక తోటలోకి వెళ్తాడు. అయితే అక్కడ అతనికి ఒక వింత చీమ కుడుతుంది. ఆ చీమ ఒక ప్రయోగశాల నుండి తప్పించుకున్న జన్యుమార్పిడి చేసిన చీమ. ఆ
చీమ కుట్టిన తర్వాత, పెల్లెలో అద్భుతమైన మార్పులు వస్తాయి. భారీ వస్తువులను సులభంగా ఎత్తగలగడం, చీమలాగే నిలువుగా ఉన్న గోడలను కూడా పాకగలగడం వంటి అనేక శక్తులు వస్తాయి. అయితే ఆ పిల్లాడు, తన శక్తిని నిలుపుకోవడానికి తీపి పదార్థాలను తింటూ ఉండాలి.

పెల్లె స్నేహితుడు, కామిక్ బుక్స్ పిచ్చి ఉన్న విల్హెల్మ్ ఈ శక్తులను చూసి, పెల్లెను ఒక సూపర్ హీరోగా మార్చాలని నిర్ణయించుకుంటాడు. వాళ్ళు కలిసి ఒక కాస్ట్యూమ్ తయారు చేసి, పెల్లెకు “యాంట్ బాయ్” అని పేరు పెడతారు. మెల్లగా యాంట్ బాయ్ పట్టణంలోని చిన్న చిన్న నేరాలను అరికడుతూ అందరి దృష్టిలో పడతాడు. ఇక కథలో అసలైన మలుపు డాక్టర్ గమెల్‌క్రా అనే విలన్ రూపంలో వస్తుంది. అతను రక్తాన్ని ఆహారంగా తీసుకుంటూ సూపర్ పవర్స్ కలిగి ఉంటాడు. ఒక రోజు పెల్లె ఇష్టపడే అమండా అనే అమ్మాయిని ఈ విలన్ కిడ్నాప్ చేస్తాడు. మరి పెల్లె తన గర్ల్ ఫ్రెండ్ ను ఎలా కాపాడుకున్నాడు ? విలన్ వల్ల మరెన్ని సమస్యలు వస్తాయి ? పెల్లె అతన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : గణతంత్ర దినోత్సవానికి ముందు ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన 5 మలయాళ వార్ డ్రామాలు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×