E-Paper
Advertisement

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అడివిశేష్ డెకాయిట్.. ఎక్కడ చూడొచ్చంటే ?

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అడివిశేష్ డెకాయిట్.. ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Decoit OTT: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో అడివి శేష్ . అలాంటి ఈయన తాజాగా నటించిన రొమాంటిక్ రివెంజ్ డ్రామా మూవీ డెకాయిట్. థియేటర్లలో ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది .. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, అనురాగ్ కశ్యప్ , కామాక్షి భాస్కర్ల, ప్రకాష్ రాజ్ , సునీల్, అతుల్ కులకర్ణి, వైభవ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే అడివి శేషు అందించారు . అలాగే షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా కనీసం నెల రోజులు కూడా థియేటర్లలో రన్ కాకుండానే ఓటీటీ లోకి రావడంతో అభిమానులు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఏ భాషలలో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన డెకాయిట్..

ఇకపోతే ప్రేయసిపై రివెంజ్ తీర్చుకునే రొమాంటిక్ రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈరోజు నుంచే డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా వచ్చేసింది. తెలుగు తో పాటు తమిళ్ ,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీకు నచ్చిన భాషలో మీరు ఈ సినిమాను చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్.

Advertisement

ALSO READ:బాలీవుడ్ పై సిమ్రాన్ ఆగ్రహం..సౌత్ నటీనటులకు అవమానం తప్పదు!

డెకాయిట్ సినిమా స్టోరీ..

డెకాయిట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హరిదాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ అనూహ్యంగా హరిదాస్ 13 ఏళ్ల జైలు జీవితం గడపాల్సి వస్తుంది. దీనికి కారణం తను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి కావడంతో ఆమెపై హరిదాసు పగ పెంచుకుంటాడు. ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని చూస్తాడు. ఈ క్రమంలోనే హరి జైలు నుండి తప్పించుకుంటాడు . అదే సమయంలో దుబాయ్ వెళ్లాలనుకుంటాడు. కానీ దానికి రూ.60 లక్షలు అవసరమవుతుంది . మరొకవైపు ఆరేళ్ల కూతురికి తల్లిగా, అనారోగ్యంతో మంచాన పడిన భాస్కర్ కి భార్యగా సరస్వతి ఉంటుంది. ఇక అదే సమయంలో పాపకి కూడా ఆరోగ్యం బాగాలేక కోటి రూపాయలు అవసరం పడుతుంది సరస్వతికి. దీంతో హరిదాసు, సరస్వతి ఇద్దరూ కలిసి భారీగా దొంగతనం ప్లాన్ చేస్తారు. ఇక డబ్బు కొట్టేసి జూలియట్ ను పోలీసుల దగ్గర ఇరికించాలని హరిదాస్ ప్లాన్ చేస్తాడు. మరి మరిదాస్ జూలియట్ పై రివేంజ్ తీర్చుకోవాలని చూసిన ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? సరస్వతి పై హరికి ఉన్న పగ ఏంటి? ఎంతో ప్రేమించిన హరిని సరస్వతి ఎందుకు జైలుకు పంపించింది ? ఇందులో కామాక్షి భాస్కర్ల, ప్రకాష్ రాజ్ ,రాంబాబుల పాత్ర ఏంటి ? ఇలా పలు అనుమానాలకు తెరపడాలి అంటే సినిమా చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×