E-Paper
Advertisement

OTT Movies : ‘రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్’ కంటే ముందు చూడాల్సిన రాధిక ఆప్టే మూవీస్

OTT Movies : ‘రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్’ కంటే ముందు చూడాల్సిన రాధిక ఆప్టే మూవీస్
Advertisement

OTT Movies : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే మోస్ట్ అవైటింగ్ మూవీ ‘రాత్ అకేలి హై ది బన్సాల్ మర్డర్స్’ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులు, అంతకంటే ముందు రాధికా కెరీర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేయాల్సిందే.

‘పార్చ్డ్’ (2015) (Parched)

లీనా యాదవ్ దర్శకత్వం వహించిన ‘పార్చ్డ్’ ఒక అద్భుతమైన చిత్రం. రిలీజ్ అయిన ఏడాదే ఈ మూవీ టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. రాధికా ఆప్టే ప్రధాన నటిగా సుర్వీన్ చావ్లా, తన్నిష్ట ఛటర్జీ, ఆదిల్ హుస్సేన్‌లతో కలిసి నటించారు. ఈ చిత్రం ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది.

‘ది వెడ్డింగ్ గెస్ట్’ (2019) (The Wedding Guest)

Advertisement

మైఖేల్ వింటర్‌ బాటమ్ దర్శకత్వం వహించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ చిత్రంలో దేవ్ పటేల్‌తో పాటు రాధికా ఆప్టే నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రాధిక నటనకు మీరు మంత్రముగ్ధులవుతారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేశాయి. అలాంటి సీన్లు ఉన్నాయి కాబట్టి ఈ మూవీని సింగిల్ గా చూడడమే బెటర్.

‘లస్ట్ స్టోరీస్’ (2018) (Lust Stories)

జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా, ఆషి దువా నిర్మించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. రాధికా ఆప్టేతో పాటు ఇందులో భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ, విక్కీ కౌశల్ కూడా నటించారు.

‘ఫోబియా’ (2016) (Phobia)

Advertisement

పవన్ కృపలానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే, అంకుర్ వికల్, సత్యదీప్ మిశ్రా నటించారు. ఈ చిత్రాన్ని ZEE5 లో చూడవచ్చు. వింత వ్యాధితో పోరాడుతున్న కల్పన అనే అమ్మాయి కథ ఇది.

‘ప్యాడ్‌మ్యాన్’ (2018)(Padman)

ఆర్. బాల్కి దర్శకత్వం వహించిన ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రంలో రాధికా ఆప్టే, అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ నటించారు. ఈ చిత్రం మహిళలు తమ పీరియడ్స్ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌ల గురించి అవగాహన కల్పించేలా ఉంటుంది. తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఈ అద్భుతమైన చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇక రీసెంట్ గా ‘సాలీ మొహబ్బత్’, ‘సిస్టర్ మిడ్ నైట్’ (Sister Midnight) అనే సినిమాలతో ఓటీటీ ఆడియన్స్ ను పలకరించిన రాధిక, ఇప్పుడు ‘రాత్ అకేలి హై’ సీక్వెల్ (Raat Akeli Hai- The Bansal Murders) తో ట్రెండింగ్ లో ఉంది.

Read Also :  2025లో స్టాండ్ అవుట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఓటీటీ స్టార్స్ వీళ్ళే… ఒక్కొక్క స్టార్ ఒక్కో ఆణిముత్యం

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×