E-Paper
Advertisement

Action Thriller OTT: గ్యాంగ్ స్టర్లకు వణుకు పుట్టించే లేడీ సింగం… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ యాక్షన్ థ్రిల్లర్

Action Thriller OTT: గ్యాంగ్ స్టర్లకు వణుకు పుట్టించే లేడీ సింగం… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Action Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ గా ఒక తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒక లేడీ ఇన్స్పెక్టర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ యాక్షన్ సీన్స్ తో దద్దరిల్లిపోతోంది. యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓ లుక్ వేయాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళితే…

ఆహా తమిళ్ (Aha Tamil) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తమిళ మూవీ పేరు ‘యోగిదా’ (Yogida). ఈ సినిమాలో సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటించగా, ప్రతినాయకుడిగా కబీర్ దుహన్ సింగ్ నటించారు. సీనియర్ నటులు సాయాజీ షిండే, మనోబాల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్, అశ్వమిత్ర సంగీతాన్ని అందించారు. వి. సెంథిల్ కుమార్ శ్రీ మోనికా సినీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6 న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఇది మిక్స్డ్ టాక్ తో నడిచింది. ఆ తరువాత మార్చి 13నుంచి ఆహా తమిళ్ (Aha Tamil) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా ఒక పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్. ఈ కథ కోయంబత్తూరులో నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్ యోగి (సాయి ధన్సిక) చుట్టూ తిరుగుతుంది. ఒక టెక్స్‌టైల్ మిల్లు యజమానిది ఆత్మహత్య కాదని, అది అతని కొడుకే చేసిన హత్య అని యోగి సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. అయితే ఈ కేసు వల్ల ఆమెకు ఉత్తర చెన్నైలోని వ్యాసర్పాడి అనే సమస్యాత్మక ప్రాంతానికి బదిలీ అవుతుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడటం యోగికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది.

వ్యాసర్పాడిలో అడుగుపెట్టిన యోగికి అక్కడ డాన్ శేఖర్ బాబు అరాచకాలు ఎదురవుతాయి. రాజకీయ అండదండలతో ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న శేఖర్ బాబును ఎదిరించడానికి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ధైర్యం చేయరు. కానీ యోగి అతని బెదిరింపులకు భయపడకుండా, తనదైన శైలిలో ఎదురుదాడి మొదలుపెడుతుంది. ఆమెపై జరిగే దాడులను తట్టుకుంటూ, ఆ గూండా సామ్రాజ్యాన్ని ఆమె ఎలా అంతం చేసిందనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also :  దీపావళి పండుగ మిడిల్ క్లాస్ మెమోరీస్ తో… లైఫ్ అంటే ఏంటో చూపించే చూడ చక్కని కథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×