// // Action Thriller OTT: కంటికి కన్పించని అద్దం నుంచి మరో ప్రపంచం -->
E-Paper
Advertisement

Action Thriller OTT: కంటికి కన్పించని అద్దం నుంచి మరో ప్రపంచంలోకి… దొంగతనానికి వెళ్తే బుర్రపాడు ట్విస్ట్

Action Thriller OTT: కంటికి కన్పించని అద్దం నుంచి మరో ప్రపంచంలోకి… దొంగతనానికి వెళ్తే బుర్రపాడు ట్విస్ట్
Advertisement

Action Thriller OTT : అమ్మాయిలతో నడిచే ఒక హీస్ట్ యాక్షన్ మూవీ ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు, కామెడీ సీన్స్ కూడా ఆడియన్స్ ను అలరిస్తాయి. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, స్నేహం, ఒకరికొకరు తోడుగా నిలిచే అంశాలను కూడా చక్కగా చూపిస్తుంది. ఈ ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ ముగ్గురు లేడి ఖిలాడిల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ చిత్రం పేరు ‘వింగ్‌వుమెన్’ (Wingwomen). ఈ సినిమాకి మెలానీ లారెంట్ దర్శకత్వం వహించడమే కాకుండా, అడెల్ ఎక్సార్‌చోపౌలోస్, మనోన్ బ్రెష్‌లతో కలిసి నటించింది కూడా. 2023లో వచ్చిన ఈ చిత్రం జెరోమ్ ములోట్, ఫ్లోరెంట్ రూపెర్ట్, బాస్టియన్ వైవ్స్ రచించిన గ్రాఫిక్ నవల ‘లా గ్రాండే ఒడాలిస్క్’ ఆధారంగా రూపొందింది. ఇది నెట్‌ఫ్లిక్స్ లో 2023 నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కరోల్, అలెక్స్ ఇద్దరు అమ్మాయిలు కిలాడి గజదొంగలుగా పేరు తెచ్చుకుంటారు. అంతేకాక వీళ్ళు ప్రాణ స్నేహితులు కూడా. చాలా కాలంగా నేర ప్రపంచంలో ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న వీళ్ళు ఇప్పుడు మారాలనుకుంటున్నారు. ఇక ఆ జీవితం నుండి విముక్తి పొంది ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకుంటారు. అయితే వీళ్ళకి తమ క్రూరమైన బాస్ నుండి తప్పించుకోవడం అంత సులభం కాదని తెలుసు. అందుకే చివరగా ఒక భారీ పెయింటింగ్‌ను దొంగిలించే మిషన్‌ను పూర్తి చేస్తేనే ఇక్కడి నుంచి బయట పడే అవకాశం వస్తుందని దానికి స్కెచ్ వేస్తారు.

ఈ డేంజర్ ఆపరేషన్ కోసం, వాళ్ళు సామ్ అనే ఒక రేస్ డ్రైవర్‌ను తమ టీంలో చేర్చుకుంటారు. ఈ ముగ్గురు కలిసి చేసే ఈ దొంగతనం లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోతాయి. ఇది కేవలం దొంగతనం మాత్రమే కాకుండా, స్వేచ్ఛ కోసం వాళ్ళు చసే పోరాటంతో సాగుతుంది. చివరికి వీళ్ళు ఆ దొంగతనం పూర్తి చేస్తారా ? వాళ్ళు స్వేచ్చగా బతుకుతారా ? అనేది ఈ ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : 4 అవార్డులు 9 అంతర్జాతీయ నామినేషన్లు… IMDbలో 7.2 రేటింగ్‌… ఇది కదా క్రైమ్ థ్రిల్లర్ అంటే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×