E-Paper
Advertisement

మాఫియాను ఏలే అనాథ… యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను ఇరగదీస్తున్న జపనీస్ థ్రిల్లర్

మాఫియాను ఏలే అనాథ… యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను ఇరగదీస్తున్న జపనీస్ థ్రిల్లర్
Advertisement

Action Thriller Movie OTT : మాఫియా అంటేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అందులో ఉన్న వాళ్ళు రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో వచ్చిన ఒక జపనీస్ మూవీ భిన్నంగా ఈ కంటెంట్ ను చూపించింది. ఈ కథ ఒక అనాథ యువకుడు జపాన్ మాఫియాలో చేరడం, ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందనే కథాంశంతో సాగుతుంది. అయితే జపాన్ ప్రభుత్వం తెచ్చిన కఠినమైన చట్టాల వల్ల మాఫియా ప్రాభవం తగ్గిపోతుంది. ఒక మాజీ నేరస్థుడిగా అతను గౌరవంగా బతకడానికి పడరాని పాట్లు పడాల్సివస్తుంది. ఈ కంటెంట్ ను హార్ట్ టచ్ అయ్యేలా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ కూడా ప్రశంసలు వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ జపనీస్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా పేరు ‘యకుజా అండ్ ది ఫ్యామిలీ’ (Yakuza and the Family). 2021లో విడుదలైన ఈ సినిమాకు మిచిహిటో ఫుజి దర్శకత్వం వహించారు. ఇందులో గో అయానో, హిరోషి తాచి లీడ్ రోల్స్ లో నటించారు. జపాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన ‘యాంటీ-గ్యాంగ్ చట్టాల’ వల్ల, నేరస్థులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో ఎలాంటి వివక్షకు గురవుతారో దర్శకుడు మిచిహిటో ఫుజి హృదయ విదారకంగా చూపించారు ఇందులో. ఈ చిత్రం జపనీస్ అకాడమీ అవార్డ్స్‌తో సహా పలు అంతర్జాతీయ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కెన్జీ అనే యువకుడు తండ్రిని కోల్పోయి ఒంటరిగా బాధపడుతుంటాడు. అనుకోకుండా ఒక మాఫియా బాస్ ప్రాణాన్ని కాపాడుతాడు. ఆ తరువాత ఆ బాస్ కెన్జీని తన సొంత కొడుకులా భావించి గ్యాంగ్‌లో చేర్చుకుంటాడు. ఎవరూ లేని కెన్జీకి ఆ గ్యాంగ్ ఒక కుటుంబంలా అనిపిస్తుంది. అక్కడ పెరుగుతూ ఆ మాఫియా సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదుగుతాడు. కొంతకాలం తరువాత ఆ గ్యాంగ్‌ల మధ్య గొడవలు ముదిరినప్పుడు, తన బాస్‌ను కాపాడుకోవడం కోసం కెన్జీ ఒక నేరాన్ని తన మీద వేసుకుని జైలుకు వెళ్తాడు. తన గ్యాంగ్ మీద ఉన్న అభిమానంతో, తన ప్రేమను కూడా వదులుకుని 14 ఏళ్లు జైలులోనే గడుపుతాడు.

అయితే తను తిరిగి వచ్చేసరికి తన గ్యాంగ్, మళ్ళీ పాత వైభవాన్ని అందుకుంటుందని ఆశపడతాడు. అయితే 14 ఏళ్ల తర్వాత కెన్జీ బయటకు వచ్చేసరికి లోకం పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వం తెచ్చిన కఠినమైన చట్టాల వల్ల మాఫియా గ్యాంగ్‌లు పట్టు కోల్పోతాయి. ఒకప్పటి మాఫియా సభ్యులు ఇప్పుడు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా తెరవలేని పరిస్థితి. అటు గ్యాంగ్ సభ్యులను కాపాడుకోలేక, ఇటు ఒక సాధారణ మనిషిలా బతకలేక కెన్జీ పడే వేదన, ఆఖరి వరకు అతను చేసే పోరాటమే ఈ సినిమా.

Advertisement

Read Also : ఫీజు ఇస్తే చాలు కోర్టులో చుక్కలు చూపించే గడుసు లాయర్… అసలైన కిక్కిచ్చే కోర్ట్ రూమ్ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×