// // Action Thriller movie: 17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్... ఒళ్ళు జలదరించేలా -->
E-Paper
Advertisement

Action Thriller movie :17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్… ఒళ్ళు జలదరించేలా ఒక్కో సీన్… అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్

Action Thriller movie :17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్… ఒళ్ళు జలదరించేలా ఒక్కో సీన్… అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Action Thriller movie: యాక్షన్ థ్రిల్లర్ లకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఆ చేసింగ్ సీన్లు, ఫైట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియన్స్. వీళ్ళ కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా. 2024లో వచ్చిన ఈ ఇండోనేషియా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా భీభత్సంగా, రక్తపాతంతో ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్ అభిమానులకు ఇది బాగా నచ్చుతుంది. 17 ఏళ్లకే భయంకరమైన కిల్లర్ గా మారిన ఒక అమ్మాయి చుట్టూ కథ ఉంటుంది. ఈ సినిమా అనేక అవార్డులను కూడా పొందింది.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘ది షాడో స్ట్రేస్’ (The Shadow Stray). దీనికి టిమో ట్జాజంటో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అరోరా రిబెరో కోడ్‌నేమ్ 13గా నటించింది. ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 10న టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఇది 2025 ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏకంగా 12 నామినేషన్లతో (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా) ఆ ఏడాది అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో 2024 అక్టోబర్ 17న స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక 17 ఏళ్ల అమ్మాయి ‘షాడోస్’ అనే సీక్రెట్ సంస్థలో చిన్నప్పటి నుంచే కిల్లర్‌గా శిక్షణ పొందుతుంది. ఆమెను కోడ్ నెంబర్13 అని పిలుస్తుంటారు. ఆమె వల్ల ఒక మిషన్ ఫైల్ కావడంతో ఆమెను ఆ సంస్థ కొద్ది రోజులు పక్కన పెడతారు. ఆమెను జపాన్ నుంచి ఇండోనేషియాకు పంపించి, కాసేపు ఆపరేషన్లకు దూరంగా ఉండమని చెప్తారు. అక్కడ ఉండగా ఆమెకు మోంజి అనే ఒక చిన్న అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయి తల్లిని ఒక డ్రగ్ మాఫియా గ్యాంగ్ చంపేస్తుంది. ఆ తర్వాత మోంజిని కూడా కిడ్నాప్ చేస్తారు. తనకి ఎవరూ లేరన్న బాధలో ఉన్న ఆ అబ్బాయిని ఎలాగైనా కాపాడాలని 13 నిర్ణయించుకుంటుంది.

కానీ ఆ అబ్బాయిని కాపాడటం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ మాఫియా వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అవినీతి పోలీసు అధికారులు ఉంటారు. తన సంస్థ చెప్పిన మాట వినకుండా 13 ఒంటరిగా వేట మొదలుపెడుతుంది. గన్‌లు, కత్తులతో ఆమె చేసే యుద్ధం రక్తం ఏరులై పారేలా ఉంటుంది. చివరికి తనని పెంచిన సంస్థకే ఎదురు తిరిగి, ఆ అబ్బాయిని ఎలా రక్షించింది? ఆ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : 65 ఏళ్ల వయసులో కిరాయి హత్యలు… బామ్మ స్కెచ్ వేస్తే చావు మేళమే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×