// // Action Thriller OTT : ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కి IMDbలో 8.3 రేటింగ్‌ -->
E-Paper
Advertisement

Action Thriller OTT : ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కి IMDbలో 8.3 రేటింగ్‌… కిర్రాక్ క్లైమాక్స్… సినిమా చరిత్రలోనే అలాంటి సీన్ చూసుండరు భయ్యా

Action Thriller OTT : ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కి IMDbలో 8.3 రేటింగ్‌… కిర్రాక్ క్లైమాక్స్… సినిమా చరిత్రలోనే అలాంటి సీన్ చూసుండరు భయ్యా
Advertisement

Action Thriller OTT : ఓటీటీ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. పవర్ ఫుల్ కథాంశం, బుర్ర బద్దలయ్యే క్లైమాక్స్‌ తో ఆడియన్స్ ను నోరు వెళ్లబెట్టేలా చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ప్రేక్షకుల మనస్సులలో చెరగని ముద్ర వేసి, చిరకాలం గుర్తుండిపోయే క్లైమాక్స్ తో వచ్చిన మూవీస్ ను అయితే వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అలాంటి వాటిలో ఒక జెమ్ లాంటి మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఇలాంటి మూవీని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. మరి ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పవర్ ఫుల్ యాక్షన్-త్రిల్లర్ పేరు “విక్రమ్” (Vikram). ఇందులో సౌత్ దిగ్గజ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించారు. ఇందులో యాక్షన్, మిస్టరీ, రాజకీయాలు, క్రైమ్ తో పాటు దేశభక్తి వంటి అంశాలు కూడా ఉన్నాయి. కానీ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం క్లైమాక్స్. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్‌స్టార్‌ లో అందుబాటులో ఉంది.ఈ చిత్రంలో కమల్ హాసన్ విక్రమ్ పోషించిన టైటిల్ రోల్ విక్రమ్ చుట్టే కథ తిరుగుతుంది. అమర్ పాత్రలో ఫహద్ ఫాసిల్ కూడా అద్భుతమైన నటనను కనబరిచాడు. అలాగే విజయ్ సేతుపతి, గాయత్రి శంకర్, సంతాన భారతి, నరైన్, కాళిదాస్ జయరామ్, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రల్లో నటించారు. సూర్య పవర్ ఫుల్ విలన్ గా కన్పిస్తాడు. ఈ మూవీకి IMDbలో 8.3 రేటింగ్‌ ఉంది.

Advertisement

Read Also : టీనేజ్ అమ్మాయి అదృశ్యం… 19 ఏళ్ల కిందటి కేసుతో లింక్… ట్విస్టులతో మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ

స్టోరీలోకి వెళ్తే…

పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్‌ డ్రగ్స్‌ ను భారీ స్థాయిలో పట్టుకుంటాడు. దీంతో అతనితో పాటు అతని తండ్రి కర్ణణ్ (కమల్ హాసన్)ను ఓ ముఠా మర్డర్ చేస్తుంది. ఇలా వరుసగా హత్యలు జరగడం కలవర పెడుతుంది. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ముఠాను పట్టుకోవడానికి అండర్ కవర్ ఆఫీసర్ కు ఒక మిషన్ ను అప్పగిస్తుంది. స్పై ఏజెంట్ అమర్ (ఫాహద్ ఫాజిల్)కి ఈ కేసును అప్పగిస్తారు. అతను స్లీపర్ సెల్ లా సైలెంట్ గా పని కానిస్తాడు. ఇన్వెస్టిగేషన్ ను మొదలు పెట్టిన అమర్ కర్ణన్ గురించి ఆరా తీస్తాడు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్నది సంతానం (విజయ్ సేతుపతి) అనే వ్యక్తి అని కనిపెడతాడు. మరోవైపు కర్ణన్ చచ్చిపోలేదు అని తెలుస్తుంది. అసలు ఈ కర్ణన్ ఎవరు ? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ? డ్రగ్స్ మాఫియా అంతు చూడాలని అతను ఎందుకు అనుకున్నాడు ? ఈ క్రమంలో విక్రమ్ కి‌ తన మనవడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరికి తన మనవడిని కాపాడుకున్నాడా ? విక్రమ్ ఎవరో తెలుసుకున్న అమర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? ఇందులో సంతానం రోల్ ఏంటి ? రోలెక్స్ (సూర్య) ఏం చేశాడు ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×