E-Paper
Advertisement

Action thriller OTT: ప్రియురాలి దెబ్బకు సైకోలా మారే ప్రియుడు… ఒక్కో సీన్ అరాచకం

Action thriller OTT: ప్రియురాలి దెబ్బకు సైకోలా మారే ప్రియుడు… ఒక్కో సీన్ అరాచకం
Advertisement

Action thriller OTT : గత ఏడాది ఒక బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ఇది రివెంజ్ నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా. ప్రేమలో మోసపోయిన ఒక వ్యక్తి క్రూరంగా ఎలా మారాడన్నదే ఈ సినిమా. 18 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ చిత్రాలలో ఒకటి. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా రికార్డ్ లకు ఎక్కింది.

ఎక్కడ చూడచ్చు అంటే

2025లో వచ్చిన ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బొర్బాద్’ (Borbaad). సూపర్ స్టార్ షకీబ్ ఖాన్, ఇధికా పాల్, జిషూ సేన్‌గుప్తా ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. మెహదీ హసన్ హృదయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రియల్ ఎనర్జీ ప్రొడక్షన్, రిధి సిద్ధి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై షహ్రీన్ అక్తర్ సుమి, అజీమ్ హరూన్ నిర్మించారు. ఈ సినిమా 2025 మార్చి 31న బాంగ్లాదేశ్‌లో విడుదలైంది. ఆ తర్వాత అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కూడా విడుదలైంది. సుమారు 18 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టలేదు. ఈ ఏడాది Hoichoi లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అరియన్ మీర్జా (షకీబ్ ఖాన్) ఒక సరదాగా తిరిగే కుర్రాడు. నీతూ (ఇధికా పాల్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే వీళ్లిద్దరి మధ్య ప్రేమ కథ చాలా కలర్‌ఫుల్‌గా మొదలవుతుంది. కానీ అనూహ్యంగా ఒక మలుపు దగ్గర నీతూ అతడిని మోసం చేస్తుంది. ఆ బాధలో ఉన్న అరియన్ తన తండ్రి అదిబ్ మీర్జా సలహాతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి వరకు సాఫ్ట్‌గా ఉన్న అరియన్, తనని మోసం చేసిన వాళ్ళపై విరుచుకుపడే ఒక యాక్షన్ హీరోలా మారతాడు. కథ రెండో భాగంలోకి వచ్చేసరికి అసలు విలన్ (జిషూ సేన్‌గుప్తా) ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళ మధ్య జరిగే మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. చివరకు అరియన్ తన పగను ఎలా తీర్చుకున్నాడు విలన్స్‌ను ఎలా ఎదుర్కొన్నాడు ? నీతూ అతన్ని ఎందుకు మోసం చేసింది. అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కట్టుకున్న దాన్ని మోసం చేసి మరొకరితో భర్త… భార్య ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు ఔట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×