E-Paper
Advertisement

OTT Movie : మూవీలో ఆ సీన్స్ ఉండాలని పట్టుబట్టే అమ్మాయి… సమ్మర్ హాలీడేస్ లో సినిమా ప్లాన్… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి బుర్రపాడు

OTT Movie : మూవీలో ఆ సీన్స్ ఉండాలని పట్టుబట్టే అమ్మాయి… సమ్మర్ హాలీడేస్ లో సినిమా ప్లాన్… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి బుర్రపాడు
Advertisement

OTT Movie : రొమాంటిక్ స్టోరీలను చూసేందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ప్రేక్షకులు. అందులోనూ ట్రయాంగిల్ లవ్ స్టోరీలంటే చెవి కోసుకుంటారు. ఇలాంటి స్టోరీలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ డిఫరెంట్ గా ఉంటుంది. సముద్రతీర దృశ్యాలు, సినిమాటోగ్రఫీకి ప్రశంసలు కూడా అందుకుంది. అంతే కాకుండా ఎక్కడా వైలెన్స్ లేకుండా ఈ స్టోరీ సున్నితంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. ఒంటరిగానే చూడటం బెట్టర్. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

కథలోకి వెళ్తే

Advertisement

పోలాండ్ సముద్రతీర పట్టణంలో నీకో, లెనా అనే టీనేజ్ స్నేహితులు బీచ్ లో వేసవి సెలవులను కలిసి గడుపుతుంటారు. వీళ్ళు ఫిల్మ్ స్కూల్‌కు అప్లై చేయడానికి ఒక ప్రేమ కథ గురించి షార్ట్ ఫిల్మ్ తీస్తుంటారు. లెనా ప్రపంచాన్ని తన కెమెరా ద్వారా చూస్తూ, నీకోపై వన్ సైడ్ లవ్ తో ఉంటుంది. కానీ నీకో ఆమెను కాస్త దూరంగానే పెడుతుంటాడు. అందుకు ఆమె బాధపడుతుంటుంది. దీనికి తోడు ఈ షార్ట్ ఫిల్మ్ లో ఒక బెడ్ సీన్ చిత్రీకరించాలనే లెనా ఆలోచన, నీకోకు ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఈ సమయంలో వీళ్ళు సముద్రంలో మునిగిపోతున్న ఇగోర్ అనే బాస్కెట్‌బాల్ ఆటగాడిని రక్షిస్తారు. ఇప్పుడు అతను కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లో చేరతాడు. ఇగోర్ రాకతో, నీకో కి అతనిపై ఇంట్రస్ట్ పెరుగుతుంది. అదే సమయంలో లెనా ఇగోర్‌ను సినిమా కోసం ఒక ముఖ్యమైన పాత్రగా చూస్తుంది. ఇది ఒక ట్రయాంగిల్ ప్రేమకు దారితీస్తుంది.

Advertisement

ఇక స్టోరీ ముందుకెళ్తున్నప్పుడు లెనా తన సినిమా పూర్తి చేయాలనే ఒత్తిడిలో ఉంటుంది. నీకో తన లైం*గికత గురించి గందరగోళంలో ఉంటాడు. ఇగోర్ తన బాస్కెట్‌బాల్ జట్టులో చోటుకోసం పోరాడతాడు. క్లైమాక్స్‌లో, లెనా, నీకో, ఇగోర్ తమ సినిమాను పూర్తి చేస్తారు. కానీ వీళ్ళ సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు ఊహించని మలుపులు తీసుకుంటాయి. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్లైమాక్స్ మీరు కూడా చూడాలనుకుంటే, ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 

‘అబ్సొల్యూట్ బిగినర్స్’ (Absolute Beginners) 2023లో విడుదలైన పోలిష్ టీవీ మినీ-సిరీస్. కమిలా తరబుర, కతర్జినా వార్జెచా దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మార్టినా బైచ్కోవ్స్కా (లెనా), బార్ట్లొమీజ్ డెక్లెవా (నీకో), జాన్ సలాసిన్స్కీ (ఇగోర్), పౌలినా క్ర్జిజాన్స్కా (మాల్వినా) ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. 6 ఎపిసోడ్‌లతో IMDbలో 7.2/10 రేటింగ్ ని పొందింది.

Read Also : బంగారంలాంటి భార్య ఉండగా మరో అబ్బాయితో… వాడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్… బెస్ట్ సైకలాజికల్ హర్రర్ మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×