E-Paper
Advertisement

Drive Movie OTT : థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్… షాకింగ్ క్లైమాక్స్ తో ఓటీటీలో నెం.1గా ట్రెండింగ్

Drive Movie OTT : థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్… షాకింగ్ క్లైమాక్స్ తో ఓటీటీలో నెం.1గా ట్రెండింగ్
Advertisement

Drive Movie OTT : ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఒక చిత్రం ట్రెండింగ్ గా మారడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ప్రశంసలు అందుకుంటోంది. నిజానికి ఈ మూవీ థియేటర్లలో ఎప్పుడు వచ్చింది ? అన్నది కూడా ఎవ్వరికీ తెలియనంత బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరి ఆ మూవీ ఏంటి ? స్టోరీ ఏంటి? అన్నది వివరంగా తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఓటీటీ ప్రియులు తరచుగా ఉత్తమ చిత్రాలు, కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తారు. ఇక అలాంటి కంటెంట్ అందిస్తూ ప్రైమ్ వీడియో చాలా మందికి ఇష్టమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్ గా మారింది. సిరీస్ అయినా లేదా సినిమా అయినా, మొదట ప్రైమ్ వీడియోలోనే దాని కోసం చూస్తారు. ఇటీవల ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ‘డ్రైవ్’ (Drive) అనే సైబర్ క్రైమ్ మూవీ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. నిజానికి సస్పెన్స్ విషయానికి వస్తే, మనం పవర్ ఫుల్ క్లైమాక్స్‌తో కూడిన కొన్ని అద్భుతమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటాము. ఇక నిర్మాతలు కూడా దానికి తగ్గట్టే అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. సినిమా ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉందంటే వచ్చే కిక్కే వేరు. ఇక ‘డ్రైవ్’ క్లైమాక్స్ కూడా అలాగే ఉండడంతో ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. రీసెంట్‌గా ‘అఖండ 2’లో విలన్‌గా నటించిన యంగ్ హీరో ఆది పినిశెట్టి ‘డ్రైవ్’లో హీరోగా నటించారు.ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అవైలబుల్ గా ఉన్న ఈ మూవీకీ, జెనుస్ మహమ్మద్ దర్శకత్వం వహించారు. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.

Read Also :  మనుషుల్లా జీవించాలని ఆశపడే రోబోలు… నవ్విస్తూనే భయపట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సౌత్ ఇండియాలోనే పేరున్న మీడియా హౌస్ ప్రజా మీడియా కార్పొరేషన్. ఈ మీడియా సంస్థ అధినేత జై (ఆది పినిశెట్టి). అతను కాబోయే భార్య (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్‌ లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఉండగానే అతని లైఫ్ ఊహించని టర్న్ తిరుగుతుంది. సడన్ గా అతని మొబైల్ తో పాటు బ్యాంక్ అకౌంట్స్, మీడియా సంస్థ అకౌంట్స్‌ ను హ్యాక్ అవుతాయి. ఆ పని ఎవరు చేశారో జైకి అంతుపట్టదు. కానీ జై వేసే ప్రతీ అడుగును హ్యాకర్ గమనిస్తాడు. అంతేకాకుండా ఈ విషయం పోలీసులకు తెలిస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. ఆలోగా జై సంస్థకు సంబంధించిన సీక్రెట్స్ ను బయట పెడుతూ అతని ప్రతిష్టపై దెబ్బకొడతాడు. దీంతో జై తన ప్రొఫెషనల్ లైఫ్ ను నాశనం చేసిన ఆ హ్యాకర్ ను ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. మరి జై అతన్ని ఎలా పట్టుకున్నాడు ? ఆ హ్యాకర్ ఎవరు ? చివరికి ఏం జరిగింది ? అన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×