E-Paper
Advertisement

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్
Advertisement

Psychological Thriller: సైకలాజికల్ థ్రిల్లర్లు అంటే చాలా మందికి ఇష్టం. కానీ కొన్ని సినిమాలు మాత్రం హత్య ఎవరు చేశారు ? అనే ప్రశ్న కంటే… అసలు నిజం ఏంటి ? అనే సందేహంతోనే ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేస్తాయి. ఒక్కో క్లూ బయటపడే కొద్దీ కథ కొత్త దారిలోకి వెళ్లిపోతుంది. చూసేవాళ్లు కూడా హీరోతో పాటు కేసును సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది A Private Life. ఆస్కార్ అవార్డు గ్రహీత జోడి ఫోస్టర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రెంచ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీలో మంచి స్పందన అందుకుంటోంది. మరి ఈ సినిమాలో అసలు మిస్టరీ ఏంటి ? ఎందుకు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

పారిస్‌లో పేరున్న సైకో అనలిస్ట్ లిలియన్ స్టైనర్. ఆమె దగ్గర చాలా మంది మానసిక సమస్యలతో చికిత్స తీసుకుంటుంటారు. తన పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే ఆమె జీవితంలో ఒక రోజు ఊహించని సంఘటన జరుగుతుంది. రెగ్యులర్‌గా థెరపీకి వచ్చే పౌలా అనే మహిళ అకస్మాత్తుగా చనిపోతుంది. మొదట అందరూ అది ఆత్మహత్యే అనుకుంటారు. కానీ పౌలా భర్త మాత్రం ఈ మరణానికి లిలియన్‌నే బాధ్యురాలని ఆరోపిస్తాడు.

Advertisement

అక్కడి నుంచే కథ ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది. పౌలా దగ్గర దొరికిన ఓ రహస్యమైన ప్రిస్క్రిప్షన్, ఆమె మరణానికి ముందు జరిగిన కొన్ని విచిత్ర సంఘటనలు లిలియన్‌లో అనుమానాలు రేకెత్తిస్తాయి. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆమె భావిస్తుంది. ఆ అనుమానమే ఆమెను నిజం కోసం చేసే ప్రమాదకరమైన అన్వేషణలోకి నెడుతుంది.

దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ హిప్నోథెరపీ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, మానసిక చికిత్స పేరుతో జరుగుతున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. సైన్స్‌ను మాత్రమే నమ్మే ఒక డాక్టర్… నమ్మశక్యం కాని సంఘటనల మధ్య చిక్కుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది ? అసలు పౌలా మరణానికి కారణం ఎవరు ? నిజంగా అది హత్యేనా ? లేక అందరికీ కనిపిస్తున్న నిజం వెనుక మరో నిజం దాగి ఉందా ? అనే ప్రశ్నలతో సినిమా చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ సినిమా.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 29 నుంచి డిజిటల్ ప్రీమియర్ అయిన ఈ సినిమా ఒరిజినల్ ఫ్రెంచ్‌తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆడియోల్లో కూడా అందుబాటులో ఉంది. జోడి ఫోస్టర్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, దర్శకురాలు రెబెక్కా జ్లోటోవ్‌స్కి కథను నెమ్మదిగా ఉత్కంఠ పెంచుతూ ముందుకు తీసుకెళ్లిన తీరు థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది వేగంగా పరిగెత్తే కమర్షియల్ థ్రిల్లర్ కాదు… ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తూ చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే సినిమా. ఈ వీకెండ్‌లో కాస్త భిన్నమైన మైండ్ గేమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే దీన్ని మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చేయొచ్చు.

Read Also: కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×