E-Paper
Advertisement

OTT Movie : కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికెళ్లి చేయకూడని పని… ఇవాళ ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్

OTT Movie : కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికెళ్లి చేయకూడని పని… ఇవాళ ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి ఒక సరికొత్త కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇందులో టెడ్ డాన్సన్ అనే ఒక 70 ఏళ్ళ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా అవతారాం ఎత్తుతాడు. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో నడుస్తుంది. మైండ్ రీ ఫ్రెష్ మూవీగా ఇది ఆడియన్స్ ని ఆ కట్టుకుంటోంది. ఇది వరకే గత ఏడాది వచ్చిన మొదటి సీజన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. ఇప్పుడు వచ్చిన సీజన్ 2 అంతకు మించి అన్నట్లు ఉంది. ఫ్యామిలీ తో సహా ఈ కామెడీ సిరీస్ ను చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ఎ మ్యాన్ ఆన్ ది ఇన్సైడ్’ మైఖేల్ షుర్ రూపొందించిన ఒక అమెరికన్ కామెడీ సిరీస్. ఇది మైట్ అల్బెర్డి రాసిన 2020 డాక్యుమెంటరీ చిత్రం ‘ది మోల్ ఏజెంట్’ ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2024 నవంబర్ 21న ప్రీమియర్ అవ్వడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండవ సీజన్ 2025 నవంబర్ 20 నుంచి 8 ఎపిసోడ్స్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ఐస్ ముక్కల మధ్య తెగిపడిన చెయ్యి… ఇంటెన్స్ తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టోరీలోకి వెళ్తే

చార్లెస్ అనే 70 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ కి ఇంట్లో కూర్చుని బోర్ కొట్టేస్తుంటుంది. ఒక రోజు ప్రైవేట్ డిటెక్టివ్ జూలీ చార్లెస్ దగ్గరకి వస్తుంది. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లోకి వెళ్లి ఒక దొంగతనం కేసు సాల్వ్ చేయాలని చెప్తుంది. ఇదేదో బాగా ఉందనుకుని, ఇక ఇంట్లో కూడా ఏం చేయాలో తోచని స్థితితలో చార్లెస్ సరే అని ఒప్పుకుంటాడు. ఇక అనుకున్నట్లే ఓల్డ్ ఏజ్ హోమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ ఉన్న అమ్మమ్మలు, నానమ్మలతో ఫ్రెండ్‌షిప్ పెట్టుకుంటూ, సీక్రెట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కానీ ఆ హోమ్‌లోని ఒక అమ్మమ్మని చూసినప్పుడు అనుమానితురాలిగా కనిపిస్తుంది. ఇక ఆమెతో చార్లెస్ ఫ్లర్ట్ చేయడం మొదలెడతాడు. ఇద్దరూ డాన్స్ వేస్తారు, కాఫీ తాగుతారు, రొమాన్స్ కూడా మొదలవుతుంది. కేసు ఇన్వెస్టిగేట్ లో ఈ రొమాంటిక్ సీన్స్ అతన్ని టెన్షన్ లో పెడతాయి. చివరికి చార్లెస్ తన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాడా ? దొంగ ఎవరో బయటపెడతాడా ? అతని ఓల్డ్ ఏజ్ ప్రేమ కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలను, ఈ అమెరికన్ కామెడీ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×