E-Paper
Advertisement

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఫాంటసీ జానర్‌లో అడ్వెంచర్, హారర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ నేరేషన్‌తో 2024 లో ఒక యూనిక్ అడిషన్‌గా నిలిచింది. ఈ స్టోరీ ప్రిన్సెస్ ఈవా అనే రాజకుమారి తన తండ్రిని కాపాడేందుకు ఒక మ్యాజికల్ క్రౌన్ కోసం ప్రమాదకరమైన ప్రయాణం చేయడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే

ప్రిన్సెస్ ఈవా అనే అమ్మాయి, తన తండ్రి కింగ్ షోరాన్‌ని ఒక డెడ్లీ ఇల్నెస్ నుంచి కాపాడేందుకు, మ్యాజికల్ క్రౌన్ కోసం ఒక శాపగ్రస్త రాజ్యంలోకి వెళ్తుంది. ఈ క్రౌన్ ఏ కోరికనైనా తీర్చగల మాయా శక్తి కలిగి ఉంటుంది. కానీ దాన్ని జఫర్ అనే వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. అతనే కింగ్ షోరాన్‌ని కర్స్ చేశాడు. ఈవా జర్నీలో మార్టిన్ అనే బ్లైండ్ బ్లాక్‌ స్మిత్‌ని కలుస్తుంది. అతను ధైర్యంగా ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఈ రాజ్యం చీకటితో నిండి ఉంటుంది. ఈ ప్రయాణంలో వారు అనేక ప్రమాదకరమైన అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది. ఈ రాజ్యంలో రాక్షస జీవులు, మాయా ఉచ్చులతో వాతావరణం భయంకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈవా, మార్టిన్ మధ్య ఏర్పడే స్నేహం కథకు ఒక ఎమోషనల్ డెప్త్ ని ఇస్తుంది. వీళ్ళు కిరీటాన్ని సంపాదించడానికి దగ్గరగా వచ్చే కొద్దీ, జాఫర్ శక్తులు మరింత తీవ్రమవుతాయి. వీళ్ళ ప్రయాణాన్ని సవాళ్లతో నింపుతాయి.

Advertisement

ఈ కథ ఒక ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఈవా, మార్టిన్ జాఫర్‌తో నేరుగా తలపడతారు. అతను కిరీటాన్ని రక్షిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు. ఈ గొడవలో ఈవా తన లో దాగి ఉన్న శక్తిని కనుగొంటుంది. మార్టిన్ సహాయంతో జాఫర్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఆమె కిరీటాన్ని స్వాధీనం చేసుకుంటుందా ? తన తండ్రిని, రాజ్యాన్ని కాపాడుకుంటుందా ? ఈ కథ ఒక సంతోషకరమైన ముగింపును ఇస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘జర్నీ టు కర్స్‌డ్ రియల్మ్’ (A journey to a cursed realm) ఒక ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా. 2024లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ డ్రామా థియేటర్స్‌లో రిలీజ్ కాకుండా, యూట్యూబ్ రీక్యాప్స్‌లో పాపులర్ అయింది. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×