E-Paper
Advertisement

Netflix: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న 7 సినిమాలు.. మీ ఫేవరెట్ మూవీ కూడా?

Netflix: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న 7 సినిమాలు.. మీ ఫేవరెట్ మూవీ కూడా?
Advertisement

Netflix: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఆదరణ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన 4 వారాలు లేదా 8 వారాలలోపే ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇంకొన్ని చిత్రాలు థియేటర్లో డిజాస్టర్ గా నిలిచాయి అంటే మాత్రం నెల తిరగకుండానే ఓటిటిలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరికొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ఈ క్రమంలోనే ప్రముఖ లీడింగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా ఏడు చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదలకు సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సందీప్ కిషన్ – సూపర్ సుబ్బు:

ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సూపర్ సుబ్బు. ఈ సినిమా అధికారికంగా తెలుగు ఒరిజినల్ స్పేస్ లోకి నెట్ ఫ్లిక్స్ వేదికగా అడుగు పెట్టింది. అంతేకాదు ఫ్లాట్ ఫామ్ మొట్టమొదటి ఒరిజినల్ తెలుగు సీరీస్ గా కూడా సూపర్ సుబ్బు రికార్డు సృష్టించింది. ఈ చిత్రం త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఆనంద్ దేవరకొండ – తక్షకుడు:

Advertisement

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ ఇటీవల బేబీ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తక్షకుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పక్కా రివేంజ్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని కూడా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ALSO READ:Rakul Preet Singh: డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పని చేయిస్తున్నారు.. నిజాలు బయటపెట్టిన రకుల్!

మాధవన్ – లెగసీ:

Advertisement

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ పెరియవర్ లెగసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం కూడా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ఇందులో గౌతమ్ రామ్ కార్తీక్, గుల్షన్ దేవయ్య, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ప్రియాంక మోహన్ – మేడిన్ కొరియా:

ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ దక్షిణ కొరియాను సందర్శించాలనే కల నిజమయ్యే ఒక తమిళ యువతి షెన్బా పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏడాది విడుదల కాబోతోంది.

విజయ్ వర్మ – ఫ్యామిలీ బిజినెస్:

తమన్నా మాజీ ప్రియుడుగా పేరు దక్కించుకున్న విజయ్ వర్మ, రియా చక్రవర్తి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫ్యామిలీ బిజినెస్. ఈ సినిమా కూడా నేరుగా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రాలతో పాటు సన్నీదేవోలు ఇక్కా, సైఫ్ అలీ ఖాన్ హమ్ హిందుస్తానీ చిత్రాలు కూడా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కానున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ చిత్రాలలో ఏ సినిమా ఎలాంటి రేటింగ్ అందుకుంటుందో చూడాలి.మరి ఈ ఏడు చిత్రాలలో మీ ఫేవరెట్ మూవీ కూడా త్వరలో విడుదల కాబోతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×