E-Paper
Advertisement

45 on OTT : డైరెక్టర్ బ్రదర్ చావే ఇన్స్పిరేషన్… క్రేజీ కన్నడ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

45 on OTT : డైరెక్టర్ బ్రదర్ చావే ఇన్స్పిరేషన్… క్రేజీ కన్నడ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

45 on OTT : శివరాజ్‌కుమార్ నటించిన ’45’ మూవీ గతనెల థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి కూడా అడుగుపెట్టబోతోంది. దాదాపు 40% సినిమా విజువల్స్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా ఉంటుంది. కెనడాకు చెందిన మార్జ్ VFX దీనికి పని చేసింది. కాస్త ఆలస్యంగా థియేటర్లలో అడుగుపెట్టినా అవుట్ పుట బాగా వచ్చింది ఈ సినిమాకి. సినిమా ఒక వ్యక్తి మరణించిన 45 రోజుల తర్వాత జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ మరణానంతర పునర్జన్మ పొందుతుందా అనేది ఇందులో ఆసక్తిగా చూపించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన సోదరుడు అకాల మరణం తర్వాత, ఈ సినిమా దర్శకుడు గరుడ పురాణంలోని అంశాలను పరిశీలించి ఈ కథను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా ఏ ఓటీటీలోకి, ఎప్పుడు రానుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం ’45’. ఈ కన్నడ ఫాంటసీ యాక్షన్ చిత్రం 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. రమేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కన్నడ పవర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి, కౌస్తుభ మణి, జిషు సేన్గుప్తా నటించారు. ఇప్పటికీ ఈ సినిమా హాళ్లలో నడుస్తోంది. 2026 జనవరి 1న తెలుగులో కూడా డబ్ అయి విడుదల అయిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను Zee5 సొంతం చేసుకుంది. దీనిని 2026 జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇది OTTplay ప్రీమియం ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది.

Advertisement

Read Also :  అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్

స్టోరీ ఏమిటంటే 

ఈ సినిమా కథ గరుడ పురాణంలోని మరణం తర్వాత ఆత్మ ప్రయాణం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో వినయ్ (రాజ్ బి. శెట్టి) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజాగ్రత్తగా కారు నడుపుతూ ఒక కుక్కను చంపేస్తాడు. ఆ కుక్క రాయప్ప (ఉపేంద్ర) అనే డాన్‌కు ప్రాణం కంటే ఎక్కువ. రాయప్ప వినయ్‌ను వెంటనే చంపకుండా, సరిగ్గా 45 రోజులు మాత్రమే సమయం ఇస్తాడు. చావు భయంతో వణికిపోతున్న వినయ్‌కు శివన్న (శివ రాజ్ కుమార్) ఒక మెంటార్‌లా పరిచయమై, అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. చివరికి ఆ డాన్ 45 రోజుల తరువాత వినయ్ ను చంపుతాడా ? ఎందుకు అంత సమయం ఇచ్చాడు ? శివన్న దీనిని ఎలా హాండిల్ చేస్తాడు ? అనేదే మిగతా కథ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×