E-Paper
Advertisement

హోటల్ గదిలో భయపెట్టే దెయ్యం… నవ్వులు పూయిస్తున్న అల్టిమేట్ కామెడీ హారర్

హోటల్ గదిలో భయపెట్టే దెయ్యం… నవ్వులు పూయిస్తున్న అల్టిమేట్ కామెడీ హారర్
Advertisement

Horror Comedy OTT : ఓ మంచి హారర్ కామెడీ చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే థాయ్ సినిమాను చక్కగా చూసేయచ్చు. వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతూ, అటు భయం ఇటు కామెడీ రెండూ కావాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. సుమారు 1 గంట 40 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్‌గా సాగిపోతుంది. ఈ సినిమా కథ ఒక మోసగాడైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక పాత, పాడుబడిన హోటల్‌ను తక్కువ ధరకు కొని, దానిని రిపేర్ చేసి ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఆ హోటల్‌లో ఒక భయంకరమైన దెయ్యం ఉంటుందని అతనికి తర్వాత తెలుస్తుంది. ఆ దెయ్యం నుండి అతను, అతని టీమ్ ఎలా తప్పించుకున్నారనేదే ఈ సినిమా.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ థాయ్ హారర్ కామెడీ సినిమా పేరు ‘404 రన్ రన్’ (404 Run Run). పిచయ జరుస్బూన్‌ప్రచా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చంతవిత్ ధనసేవి, కన్యావీ సాంగ్మువాంగ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ముఖ్యంగా థాయ్ హారర్-కామెడీ స్టైల్‌లో సాగుతుంది. అంటే మన ‘ప్రేమకథా చిత్రమ్’ లాగా భయం వేస్తూనే కడుపుబ్బ నవ్విస్తుంది. ఇందులో హీరోగా నటించిన చంతవిత్ ధనసేవి థాయ్‌లాండ్‌లో పెద్ద స్టార్, ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అలాగే దెయ్యం పాత్రలో నటించిన కన్యావీ లుక్స్, ఆ పాడుబడిన హోటల్ సెట్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో అందుబాటులో ఉంది. థాయ్ భాషలో ఉన్నా కూడా ఇంగ్లీష్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ పెట్టుకుని హాయిగా చూసేయొచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో హీరో నక్రోబ్ ఒక ఆరితేరిన రియల్ ఎస్టేట్ మోసగాడు. పాడుబడిన ఇళ్లను కొని, వాటికి రంగులు పూసి కొత్తవిగా నమ్మించి అమాయకులకు అంటగట్టడం వీడి పని. ఈ క్రమంలోనే ఊరికి చివర కొండల మీద ఉన్న ఒక పాత హోటల్ గురించి తెలుసుకుంటాడు. ఆ హోటల్ యజమాని ‘లలిత’ చనిపోయి చాలా కాలం కావడంతో అది పాడుబడి ఉంటుంది. దీన్ని తక్కువ రేటుకు కొట్టేసి, రిపేర్లు చేసి కోట్లకు అమ్మేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని తన బ్యాచ్‌ను వేసుకుని ఆ హోటల్‌లోకి అడుగుపెడతాడు. వీళ్లు హోటల్‌లో దిగి గోడలకు సున్నాలు కొడుతుంటే, అక్కడ రూమ్ నెంబర్ 404 లో ఉన్న లలిత దెయ్యానికి పిచ్చ కోపం వస్తుంది. తన సొంత హోటల్ ని అమ్ముకోవాలని చూస్తున్న ఈ గ్యాంగ్‌ను వదిలిపెట్టకూడదని అది డిసైడ్ అవుతుంది.

ఇక రాత్రి అయ్యేసరికి హోటల్ గదుల్లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులు గాలిలో ఎగరడం మొదలవుతాయి. మొదట్లో ఇవన్నీ ఎవరో భయపెట్టడానికి చేస్తున్నారని హీరో లైట్ తీసుకుంటాడు కానీ, దెయ్యం నేరుగా కళ్లముందు ప్రత్యక్షమయ్యే సరికి వాళ్లకి గుండె ఆగినంత పనవుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు భలే కామెడీగా ఉంటాయి. అయితే ఈ కథలో కేవలం భయమే కాదు, ఒక చిన్న మిస్టరీ కూడా ఉంటుంది. అసలు లలిత ఎలా చనిపోయింది? ఆ హోటల్‌లో ఏం జరిగింది? రూమ్ నెంబర్ 404 మిస్టరీ ఏమిటి ? వీళ్లు ప్రాణాలతో బయటపడ్డారా ? అనే విషయాలను ఈ కామెడీ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : సీరియల్ కిల్లర్‌కే చుక్కలు చూపించే పిరికోడు… అసలైన కిక్కు ఇచ్చే క్రేజీ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×