E-Paper
Advertisement

ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు
Advertisement

2026 Web Series on OTT : ప్రతి సంవత్సరం వందలాది కొత్త సిరీస్‌లు వస్తున్నాయి. ఏది చూడాలో, ఏది స్కిప్ చేయాలో నిర్ణయించడం చాలా కష్టం. 2026 సంవత్సరం సగం కూడా పూర్తి కాకముందే ఎన్నో హిట్ సిరీస్‌లు వచ్చేశాయి. సమయం వృథా చేసుకోకుండా, నిజంగా బాగున్నవి మాత్రమే చూడాలంటే ఈ ఏడు సిరీస్ లు బెస్ట్ సజెషన్.

1. ‘హిస్ అండ్ హెర్స్’ (Netflix)

ఇది 2026 జనవరి 8న రిలీజ్ అయింది. ఆలిస్ ఫీనీ నవల ఆధారంగా తీసిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో టెస్సా థాంప్సన్ అద్భుతంగా నటించింది. విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఒక మర్డర్ కేసులో ఒకరినొకరు సందేహిస్తూ ఇద్దరూ విడివిడిగా దర్యాప్తు చేస్తారు. 6 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. వీకెండ్ లో ఒక్కసారి పూర్తి చేసేసుకోవచ్చు. సస్పెన్స్, ట్విస్టులతో ఇది క్రేజీగా ఉంటుంది.

2. ‘ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ రెగ్గీ డింకిన్స్’ (NBC)

Advertisement

2026 ఫిబ్రవరిలో వచ్చిన ఈ స్పోర్ట్స్ మాక్‌డాక్యుమెంటరీ కామెడీలో ట్రేసీ మోర్గాన్ యాక్టింగ్ సూపర్. డిస్‌గ్రేస్ అయిన ఫుట్‌బాల్ ప్లేయర్ రెగ్గీ డింకిన్స్ తన లైఫ్‌ను తిరిగి బిల్డ్ చేసుకోవడం గురించి కథ ఉంటుంది. ఇందులో డేనియల్ రాడ్‌క్లిఫ్, మేగాన్ థీ స్టాలియన్ వంటి స్టార్లు కూడా ఉన్నారు. రాటెన్ టొమాటోస్‌లో 100% స్కోర్ తో నవ్వులు, ఎమోషన్ తో ఆకట్టుకుంటున్నాయి. రెండూ ఉన్నాయి.

3. ‘పోనీస్’ (Peacock)

జనవరి 15, 2026న రిలీజ్. ఎమిలియా క్లార్క్, హేలీ లూ రిచర్డ్‌సన్ నటించిన స్పై థ్రిల్లర్. భర్తలు చనిపోయిన తర్వాత ఇద్దరు సాధారణ మహిళలు CIA సెక్రటరీలుగా మారి స్పైలుగా మారడం గురించి. సీరియస్ స్పై డ్రామాల మధ్య హాస్యం కూడా ఉండే ఫన్ సిరీస్. కెమిస్ట్రీ బాగుంది.

4. ‘గర్ల్ టేకెన్’ (Paramount+)

Advertisement

2026 జనవరి 8, వచ్చింది. ఐదేళ్లు బంధీగా ఉండి, తప్పించుకున్న యువతి జీవితం ఎలా మారింది అనేది హృదయవిదారకంగా చూపించే డ్రామా ఇది. ఇందులో ఆల్ఫీ అలెన్ నటన భయపెట్టేస్తుంది. స్లో బర్న్ సస్పెన్స్, ఎమోషనల్ డెప్త్ ఉన్న సిరీస్.

5. ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ 

20 ఏళ్ల యువతి తన ప్రొఫెసర్‌తో అఫైర్, గర్భం, ఇంటి నుంచి బయటకు వెళ్లడం, ఆ తర్వాత ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించడంతో కథ సాగుతుంది. నిషిద్ధమైన కథ అయినా బ్యాలెన్స్ గా ఉంది. రాటెన్ టొమాటోస్‌లో 97% స్కోర్ కూడా పొందింది.

6. ‘వండర్ మ్యాన్’ (Apple TV+)

సూపర్‌హీరో జానర్‌పై వ్యంగ్యంగా తీశారు. అతీంద్రియ శక్తులున్నవాడు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణించడానికి ప్రయత్నించడం గురించిన మెటా-కామెడీ ఇది. ఓటీటీలో ఆకట్టుకునే సిరీస్ కూడా .

7. ‘రన్ అవే’ (Netflix)

జేమ్స్ నెస్‌బిట్ నటించిన థ్రిల్లర్. మత్తుపదార్థాల వ్యసనంతో బాధపడుతున్న కూతురి కోసం తండ్రి అండర్‌వరల్డ్‌లోకి వెళ్లడం గురించి. ఎమోషనల్, ఉత్కంఠభరితమైన మిస్టరీ.ఈ సిరీస్‌లు 2026లో నిజంగా మంచి వినోదం ఇచ్చాయి. మీకు ఏ జానర్ ఇష్టమో దాని ప్రకారం వీకెండ్ ప్లాన్ చేసుకోండి.

Read Also : శాప గ్రస్త అడవిలో ఒంటరి మహిళ… ఓటీటీని వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×