E-Paper
Advertisement

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో ఇరుక్కుపోయే అక్కాచెల్లెళ్ళు … స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో ఇరుక్కుపోయే అక్కాచెల్లెళ్ళు … స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మంచి వ్యూస్ తో అదరగొడుతోంది. ఈ స్టోరీ ఒక స్విమ్మింగ్ పూల్ లో జరుగుతుంది. క్షణ క్షణం ఉత్కంఠంగా సాగుతుంది. ఇద్దరు సిస్టర్స్ ఫూల్ లో ఇరుక్కుపోవడంతో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

బ్రీ (నోరా-జేన్ నూన్), జోనా (అలెగ్జాండ్రా పార్క్) ఇద్దరు టీనేజ్ సిస్టర్స్ ఉంటారు. వీళ్ళు పైకి ప్రేమతో ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం కాస్త తేడాగానే వుంటారు. చాలా రోజుల తరువాత కలసిన ఈ సిస్టర్స్ సరదాగా స్విమ్ చేయడానికి, ఒక స్థానిక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్‌కు వెళతారు. ఇది వాళ్ళకు బాల్యంలో గడిపిన సమయాన్ని గుర్తు చేస్తుంది. ఈ పూల్ 12 అడుగుల లోతు ఉన్న డైవింగ్ ఏరియాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళు అక్కడ ఈత కొడుతూ ఆనందిస్తుంటారు. సాయంత్రం పూల్ మూసివేసే సమయంలో, బ్రీ కి చెందిన నిశ్చితార్థపు ఉంగరం పూల్ లోతైన భాగంలో జారిపోతుంది. ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకోవడానికి బ్రీ, జోనా ఇద్దరూ పూల్‌లోకి దిగుతారు.

అయితే వాళ్ళు లోపల ఉండగానే, పూల్ మేనేజర్ అనుకోకుండా పూల్ కవర్‌ను మూసివేస్తాడు. దీంతో వాళ్ళు 12 అడుగుల లోతైన పూల్‌లో చిక్కుకుంటారు. ఆతరువాత అసలు స్టోరీ మొదలౌతుంది. ఈ ఫూల్ లో పనిచేసే ఒక మహిళ సైకోగా మారి, ఈ సిస్టర్స్ ని ఇబ్బంది పెడుతుంది. ఒకానొక సమయంలో ఈ సిస్టర్స్ ఇద్దరూ బాగా గొడవ పడతారు. చివరికి ఆ ఫూల్ నుంచి వీళ్ళు బయట పడతారా ? ఆ సైకో మహిళ వీళ్ళను ఏమైనా చేస్తుందా ? ఈ సిస్టర్స్ ఎందుకు గొడవ పడతారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : గోల్డ్ స్మగ్లింగ్ కోసం పుష్పను మించిన ప్లాన్… ఈ మలయాళ థ్రిల్లర్ లో ఒక్కో ట్విస్టుకు బుర్ర బద్దలే

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో 

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ’12 ఫీట్ డీప్’ (12 Feet Deep). 2017లో వచ్చిన ఈ సినిమాకి మాట్ ఎస్కాండారి దర్శకత్వం వహించారు.ఇందులో నోరా-జేన్ నూన్ (బ్రీ), అలెగ్జాండ్రా పార్క్ (జోనా), డయాన్ ఫర్ (క్లారా), టోబిన్ బెల్ (మెక్‌గ్రాడీ) వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఇద్దరు బ్రీ, జోనా అనే అక్కా చెల్లెళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక స్విమ్మింగ్ పూల్‌లో చిక్కుకుని, బతికి బయటపడేందుకు పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×