E-Paper
Advertisement

Pushpa 2 OTT Update: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరో సర్ప్రైజ్ తో ఓటీటీలోకి..!

Pushpa 2 OTT Update: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మరో సర్ప్రైజ్ తో ఓటీటీలోకి..!
Advertisement

Pushpa 2 OTT Update:పుష్ప2 (Pushpa2).. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అతి తక్కువ సమయంలోనే రూ.1850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ‘దంగల్’ (హిందీ) సినిమాను టార్గెట్ గా పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడానికి కారణం నార్త్ ఆడియన్స్ అని చెప్పవచ్చు. సగానికి పైగా ఒక నార్త్ నుండే ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకి జనవరి 17వ తేదీ నుంచి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ అంటూ మరో 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేయడం జరిగింది.

ఓటీటీలోకి వచ్చేముందు మరోసారి ప్రైజ్..

Advertisement

అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చే ముందు మరో సర్ప్రైజ్ తో రానుంది అని సమాచారం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. పుష్ప 2 ఓటీటీలోకి వస్తుండగా.. దీనికోసం మరో 10 నిమిషాల అదనపు ఫుటేజ్ రెడీగా ఉందని సమాచారం. ఈ ఫుటేజ్ ఇప్పటివరకు థియేటర్లలో చూపించలేదు. కాబట్టి నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసే ప్రేక్షకులకు ఇది మరో కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 3:15 గంటల నిడివితో ఈ సినిమా ప్రారంభమైతే దీనికి 20 నిమిషాల ఫుటేజ్ ను కూడా ఇటీవల జత చేశారు. దీంతో 3:35 గంటలుగా సినిమా నిడివి పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో వచ్చే సమయానికి ఈ చిత్రానికి మరో 10 నిమిషాలు జత చేయడంతో మొత్తం ఈ సినిమా 3:45 గంటల నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది అని సమాచారం. థియేటర్లో ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వచ్చే ఈ మార్పులతో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మరి ఈ కొత్త కంటెంట్ తో ఓటీటీలో కూడా పుష్ప2 ఎలా దూసుకుపోతుందో చూడాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప 2సినిమా తారాగణం..

Advertisement

అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, రష్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) ఐటమ్ సాంగ్ తో మెప్పించింది. పుష్ప సినిమాలో సమంత (Samantha)ఏ రేంజ్ లో అయితే ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఇందులో శ్రీ లీలా కూడా తన ఐటెం సాంగ్లో మరొకసారి మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ తో శ్రీ లీల కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేసి.. బాలీవుడ్ కి వెళ్లనున్నట్లు సమాచారం.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×