// // OTT Movie : ట్విన్ బ్రదర్స్... ఒకడు ప్రేమించిన అమ్మాయితో -->
E-Paper
Advertisement

OTT Movie : ట్విన్ బ్రదర్స్… ఒకడు ప్రేమించిన అమ్మాయితో మరొకడు… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

OTT Movie : ట్విన్ బ్రదర్స్… ఒకడు ప్రేమించిన అమ్మాయితో మరొకడు… నరాలు కట్ అయ్యే సస్పెన్స్
Advertisement

OTT Movie : మలయాళం హీరో ఫహద్ ఫాసిల్ కి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ‘పుష్ప’ సినిమా తరువాత పాన్ ఇండియా లెవెల్ లో తన కంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. అన్ని పాత్రల్లో ఇట్టే ఇమిడిపోయే నటన అతని సొంతం అనే చెప్పుకోవాలి. అంతలా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతను నటించిన ఒక మూవీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో కేక పెట్టించింది. చివరి వరకూ ఈ సినిమా సస్పెన్స్ తో, నెక్స్ట్ ఎం జరుగుతుందనే ఆతృతను పెంచుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

యూట్యూబ్ (YouTube) లో

Advertisement

 ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘1 బై టూ’ (1 by two). 2014 లో వచ్చిన ఈ సినిమాకి అరుణ్ కుమార్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫహద్ ఫాసిల్, మురళి గోపి , హనీ రోజ్, అభినయ, శ్యామప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక జంట కవలలైన ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 5.3/10 రేటింగ్ ఉంది. యూట్యూబ్ (YouTube) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ స్టోరీ బెంగళూరులో హరి నారాయణన్, రవి నారాయణన్ అనే కవల సోదరుల చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరు సోదరులకు ఒకరిమీద ఒకరికి చాలా అభిమానం ఉంటుంది. హరి ఒక వైద్య వృత్తిలో ఉండగా, రవి ఒక కథకళి కళాకారుడిగా ఉంటాడు. సంతోషకరంగా ఉన్న వీళ్ళ లైఫ్ఇ, ఒక్కసారిగా విషాదకరమైన ప్రమాదంతో మలుపు తిరుగుతుంది. ఇందులో హరి ఒక కారు ప్రమాదంలో మరణిస్తాడు. ఈ సంఘటన రవిని తీవ్రమైన మానసిక వేదనకి గురిచేస్తుంది. రవి మానసిక స్థితి, అతని చర్యలు అనుమానాస్పదంగా ఉండటంతో, బెంగళూరు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ యూసుఫ్ మరిక్కర్ (ఫహద్ ఫాసిల్) ఈ కేసును దర్యాప్తు చేయడానికి నియమించబడతాడు. యూసుఫ్ తన భార్యతో (అభినయ) జీవితాన్ని గడుపుతూ, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తాడు.

ఈ దర్యాప్తులో హరి మరణం చుట్టూ అనేక రహస్యాలు తెరపైకి వస్తాయి. హరి, రవి ల తండ్రి, ఒక ధనవంతమైన వ్యాపారవేత్త. కేసును చట్టపరమైన ఫార్మాలిటీల నుండి తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఇది యూసుఫ్‌కు మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది. రవి మానసిక స్థితి, కథకళి కళాకారుడిగా ఉన్న అతని గతం, హరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ స్టోరీని ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి. హరి మరణం వెనుక ఉన్న నిజం, రవి సైకోసిస్, వీళ్ళ కుటుంబ రహస్యాలు యూసుఫ్ దర్యాప్తులో క్రమంగా బయటపడతాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్‌తో ముగుస్తుంది. చివరికి హరి మరణానికి కారణం ఎవరు ? ఇన్స్పెక్టర్ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : రాత్రిపూట గోర్లు కట్ చేసుకుంటే ఈ దెయ్యానికి బలి… చలికాలంలో కూడా చెమటలు పట్టించే హర్రర్ మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×