E-Paper
Advertisement

Saudi Arabia: పేరెంట్స్‌ని చంపి ఆత్మహత్య చేసుకున్న టీనేజర్, తెలుగు రాష్ట్రాలకు చెందినవారే, సౌదీలో దారుణం

Saudi Arabia: పేరెంట్స్‌ని చంపి ఆత్మహత్య చేసుకున్న టీనేజర్, తెలుగు రాష్ట్రాలకు చెందినవారే, సౌదీలో దారుణం
Advertisement

Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పేరెంట్స్‌ని చంపిన తర్వాత భారతీయ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానిక ఎన్నారైల్లో కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఎందుకు అలాంటి పని చేశాడు? మృతుడి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.

సౌదీ అరేబియాలో ఊహించని ఘటన

Advertisement

సౌదీ అరేబియాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ టీనేజర్.. తల్లిదండ్రులను చంపి ఆపై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని రియాద్ సిటీలో ఈ ఘటన వెలుగుచూసింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా నివాసం ఉండే హరా ఏరియాలో ఈ ఘటన జరిగింది.

రాజమండ్రికి చెందిన రవి-శ్రీదేవి సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక్క కొడుకు ప్రభాకర్. అక్కడ 12వ తరగతి చదువుతున్నాడు. అక్కడ ఓ బ్యాంకులో రవి ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇక వారి కొడుకు ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో 12 తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్నాడు.

Advertisement

పేరెంట్స్‌ని చంపి ఆత్మహత్య చేసుకున్న టీనేజర్.. బాధిత ఫ్యామిలీ ఏపీకి చెందినవారు

మరి ఏం జరిగిందో తెలీదుగానీ గురువారం తల్లిదండ్రులను అత్యంత దారుణంగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత మరో ప్రదేశానికి వెళ్ళి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభాకర్. పేరెంట్స్‌ని చంపిన తర్వాత ఆన్‌లైన్‌లో భోజనం  తెప్పించు కున్నాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. భోజనం తర్వాత ఆత్మహత్య చేసుకోన్నట్లు అక్కడ లభించిన ఆధారాలు ద్వారా తెలుస్తోంది.

ఈ ఘటన గురించి తెలియగానే రియాద్‌లో తెలుగు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రవి ఫ్యామిలీ అందరితో కలిసిమెలిసి ఉండేదని స్థానిక ఎన్నారైలు చెబుతున్నారు. కేసుకు సంబంధించిన అన్నివివరాలు సేకరించే పనిలో పడ్డారు అక్కడి పోలీసులు. ఏపీలోని వారి బంధువులకు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ALSO READ: పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్దం.. 70 మంది ఉగ్రవాదులు హతం.. 55 పాక్ సైనికులు మృతి!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×