E-Paper
Advertisement

Yamuna flood news : యుమునా నది మళ్లీ ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు..

Yamuna flood news : యుమునా నది మళ్లీ ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు..
Advertisement
Yamuna river flood news

Yamuna river flood news(Telugu flash news):

యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. రెండ్రోజులుగా ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నదిలో ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో నీటిమట్టం 205 మీటర్లు దాటింది.

గత నెలలో దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యుమునా పరవళ్లు తొక్కడంతో హస్తిన అతలాకుతలమైంది. తాజాగా మరోసారి నదిలో ప్రవాహం అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. యుమునా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలో ప్రవాహం భారీగా పెరిగింది.

Advertisement

ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 204.50 మీటర్ల ప్రమాద స్థాయి దాటిందని కేంద్ర జల సంఘం పేర్కొంది. పాత రైల్వే వంతెన వద్ద సోమవారం సాయంత్రం 3 గంటలకు 203.48 మీటర్ల నీటిమట్టం నమోదైంది. మంగళవారం రాత్రికి నీటి మట్టం 205.33 మీటర్ల చేరింది. ఆ తర్వాత నీటిమట్టం 205.39 మీటర్లకు పెరిగింది.

హర్యానాలోని యమునా నగర్‌ హత్నీకుండ్‌ బ్యారేజీ నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి మరోసారి వరద ముప్పు పొంచిఉంది. ఇప్పటికే వరదలపై వ్యవసాయ, వరద నియంత్రణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జులై నెలలో వచ్చిన వరదల తీవ్రతతో పోల్చితే కొంచె తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యమునా నదిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×