E-Paper
Advertisement

Cyclone : తుపాన్ తీవ్రరూపం.. ఎక్కడ తీరం దాటుతుందంటే..?

Cyclone : తుపాన్ తీవ్రరూపం.. ఎక్కడ తీరం దాటుతుందంటే..?
Advertisement

Cyclone : బిపోర్‌జాయ్‌ తుపాను ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది అతిపెను తుపానుగా మారున్నట్లు హెచ్చరించింది భారత వాతావరణశాఖ. ప్రస్తుతం ఈ తుపాను తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. బిపోర్‌జాయ్‌ గంటకు 5 కిలోమీటర్లు వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. కొద్ది గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది.

Advertisement

బిపోర్‌జాయ్‌ తుపాను పాకిస్థాన్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతల వద్ద తీరాన్ని తాకవచ్చని అంచనా వేస్తోంది ఐఎండీ. దాదాపు ఈ నెల 15 మధ్యాహ్నం నాటికి తీరాన్ని చేరుతుంది. ముంబైకి ఉత్తర నైరుతి దిక్కున 530 కిలోమీటర్ల దూరంలో.. పోర్‌బందర్‌ రేవుకు దక్షిణాన 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది భారత వాతావరణశాఖ. ఈ తుపాను మరింత తీవ్రమై పాకిస్థాన్‌, గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ వద్ద తీరాన్ని తాకవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావంతో పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టు ట్రస్ట్‌ ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నౌకలకు ఎమర్జెన్సీ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. 25 నాటికల్‌ మైళ్లకు మించిన వేగంతో గాలులు వీస్తే.. నౌకల కార్యకలాపాలను సస్పెండ్‌ చేస్తున్నట్లు .. గాలి వేగం 35 నాటికల్‌ మైళ్లను మించితే కార్గో నౌకల కదలికలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది కరాచీ పోర్టు ట్రస్ట్‌. పోర్టు నౌకలతో అత్యవసర సంబంధాల కోసం రెండు ఎమర్జెన్సీ ప్రీక్వెన్సీలను కూడా విడుదల చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×