E-Paper
Advertisement

Vegetables Rate : వెజ్ వర్రీ.. ఏం కొనేటట్టు లేదు..

Vegetables Rate : వెజ్ వర్రీ.. ఏం కొనేటట్టు లేదు..
Advertisement

Vegetables Rate : కిలో టమాట 50 రూపాయలు. పచ్చిమిర్చీ అయితే ఏకంగా 180 రూపాయలు. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రతీ కూరగాయ ధర ఆకాశాన్ని అంటుతోంది. సరైన సమయంలో వర్షాలు లేకపోవడం.. దిగుబడి తగ్గడంతో.. ధరలు చుక్కలనుంటుతున్నాయి. కూరగాయలను సామాన్యుడు కొనే పరస్థితి లేకుండా పోయింది. 500 రూపాయలతో బజార్ కెళ్తే.. వారం సరిపడా కూరగాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు. రైతుబజార్ లో ధరల పట్టికలో ఒక్క కూరగాయ రేటైనా.. 50 కి తక్కువగా లేకపోవడంతో.. వినియోగదారుడి గుండె గుబేల్ మంటోంది.

Advertisement

వర్షాకాలం ప్రారంభమైనా.. కూరగాయల ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. గతవారం వరకు ఎండలు మండిపోయాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో.. కేవలం బోరుబావి సౌకర్యం ఉన్నవారు మాత్రమే కూరగాయలను పండించారు. కొన్ని చోట్ల సరైన సమయంలో పంటకు నీరందక.. వదిలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో వర్షాకాలం మొదట్లోనే కూరగాయల దిగుబడి భారీగా తగ్గింది. డిమాండ్ కు తగ్గట్లు సప్లై లేకపోవడంతో.. ధరలు సామాన్యుడికి అందనంటున్నాయి. ఇటు వ్యాపారులు కూడా పక్క మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనే సాకుతో ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఏం కొనేటట్టు, ఏం తినేటట్టు లేదంటూ వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×