E-Paper
Advertisement

Toll Gate: టోల్ కూడా బాదేశారు.. మోదీజీ జర దేఖోజీ!

Toll Gate: టోల్ కూడా బాదేశారు.. మోదీజీ జర దేఖోజీ!
Advertisement
toll gate

Toll Gate: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేశారు. గ్యాస్ బండపై బాదేశారు. అన్ని సర్వీసులను ప్రీమియం చేసేశారు. యూపీఐ పేమెంట్స్‌పైనా పైసా వసూల్ చేస్తున్నారు. ఇంకేం పెంచుతారులే అనుకుంటుండగా.. టోల్ ఛార్జీలు పెంచేసి వాహనదారులకు షాక్ ఇచ్చారు. మోదీ పాలనతో అన్నీ పెరుగుటయే కానీ.. తగ్గేదేలే .. అంటూ దేశ ప్రజలు పెదవి విరుస్తున్నారు.

దేశ వ్యాప్తంగా పెంచిన టోల్‌గేట్ చార్జీల బాదుడు ప్రారంభమైంది. వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతూ NHAI టోల్ తీత స్టార్ట్ చేసింది. అన్ని టోల్‌ప్లాజాల దగ్గర 5 శాతం ట్యాక్స్ పెరిగింది. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగా ఈసారి కూడా టోల్‌ ఛార్జీలు పెంచేశారు. సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.

Advertisement

ఇప్పటికే ఇంధన ధరలతో ట్రాన్స్‌పోర్టు ఖరీదుగా మారి.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అదనంగా టోల్ ఛార్జీలు కూడా తోడవడంతో.. ధరల పెరుగుదల మరింతగా ఉంటుందని అంటున్నారు. పెరిగిన టోల్ ఛార్జీలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. టోల్ ఎంత పెరిగిందో.. అంతగా టికెట్ ఛార్జీలు పెంచారు. ఆ భారం ప్యాసింజర్ల మీదే మోపారు. టోల్ ఎఫెక్ట్ లారీల మీద, గూడ్స్ వాహనాల మీదా పడుతుంది. సరుకులు, వస్తువుల ధరలూ పెరగడం ఖాయం. టోల్ తీత మామూలుగా ఉండదు ముందుముందు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×