E-Paper
Advertisement

Paper Leak: అస్సాంలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. టీచర్లే ప్రధాన నిందితులు..

Paper Leak: అస్సాంలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. టీచర్లే ప్రధాన నిందితులు..
Advertisement

Paper Leak: ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్ల నుంచి టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల వరకు అన్నింటిని లీక్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపుతుంటే.. ఆస్సాంలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోమవారం జరగాల్సిన జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఆదివారం లీక్ అయింది. వెంటనే గుర్తించిన అధికారులు ఎగ్జామ్‌ను రద్దు చేశారు.

ఈ వ్యవహారంలో 12 మంది విద్యార్థులతో పాటు మరో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఇద్దరు టీచర్లను ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. లుహిత్ ఖబాలు హైస్కూల్ ప్రిన్సిపల్‌ ప్రణబ్ దత్తా, లఖింపూర్‌లోని డప్లకటా హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న కుముద్ రాజ్‌ఖోవా పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించారు.

Advertisement

ప్రణబ్ దత్తాను అదుపులోకి తీసుకోగా.. కుముద్ రాజ్‌ఖోవా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రణబ్ దత్తా ఇంటి నుంచి కాలిబూదిదైన పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందిదులు ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 300 నుంచి రూ. 3 వేలు వసూల్ చేశారని వెల్లడించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×