// // Swati: బెదిరింపులకు బయపడను.. ఎన్నో సవాళ్లెదుర్కొన్నా.. జీవితాంతం పోరాడుతా: స్వాతి మలివాల్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Swati: బెదిరింపులకు బయపడను.. ఎన్నో సవాళ్లెదుర్కొన్నా.. జీవితాంతం పోరాడుతా: స్వాతి మలివాల్

Swati: బెదిరింపులకు బయపడను.. ఎన్నో సవాళ్లెదుర్కొన్నా.. జీవితాంతం పోరాడుతా: స్వాతి మలివాల్
Advertisement

Swati: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌ను ఓ వ్యక్తి వేధించిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై స్వాతి మలివాల్ భగ్గుమన్నారు. బెదిరింపులకు తాను బయపడనని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడ్డానని చెప్పారు. తనపై ఎన్నో దాడులు జరిగినప్పటికీ తన ప్రశ్నించే గొంతుకను ఆపలేదని వెల్లడించారు. అవే తనలో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచాయని తెలిపారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

ఇటీవల ఢిల్లీలో మహిళా భద్రతను పర్యవేక్షించేందుకు స్వాతి మలివాల్ అర్థరాత్రి రోడ్డు పక్కన నిలబడ్డారు. ఈక్రమంలో ఓ వ్యక్తి కారులో వచ్చి ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు, కారులోకి ఎక్కాలని బలవంతం చేశాడు. వెంటనే స్వాతి మలివాల్ అతడిని కారులోంచి బయటకు లాగే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేయి కారు లోపల ఉండగానే ఆ వ్యక్తి కారు అద్దాలను ఎక్కించి లాక్కెళ్లాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో మహిళా చైర్ పర్సన్‌కే భద్రత లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని స్వాతి మలివాల్ ప్రశ్నించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Advertisement

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ.. స్వాతి మలివాల్‌ వేధించిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాడేనని వెల్లడించింది. స్వాతి మలివాల్ ఆప్‌తో కలిసి ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఉందని ఆరోపించింది.

దీంతో ట్విట్టర్ వేదికగా బీజేపీపై స్వాతి మలివాల్ మండిపడ్డారు. తనను ఎవరూ ఆపలేరని, బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×