E-Paper
Advertisement

Modi: మోదీ బంగారు విగ్రహం.. ఎక్కడంటే?

Modi: మోదీ బంగారు విగ్రహం.. ఎక్కడంటే?
Advertisement

Modi: తమకు ఇష్టమైన వ్యక్తులపై ఉన్న అభిమానాన్ని కొందరు వినూత్న రీతిలో చాటుకుంటుంటారు. కొందరు బహుమతులు ఇస్తే.. మరికొందరు ఇతర పద్ధతుల్లో వ్యక్తపరుస్తుంటారు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ స్వర్ణకారుడు ప్రధాని మోదీపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో వ్యక్తపరిచాడు. ఏకంగా బంగారంతో మోదీ విగ్రహాన్ని రూపొందించాడు.

సూరత్‌కు చెందిన సందీప్ జైన్ అనే స్వర్ణకారుడు 156 గ్రాముల మేలిమి బంగారాన్ని ఉపయోగించి ప్రధాని మోదీ విగ్రహాన్ని అద్భుతంగా మలిచాడు. దాదాపు 20 మంది స్వర్ణకారులు నెల రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహ తయారీకి రూ. 11 లక్షల వరకు ఖర్చు పెట్టామని సందీప్ జైన్ తెలిపాడు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లకు గానూ 156 స్థానాల్లో గెలుపొందినందుకు గుర్తుగా 156 గ్రాముల బంగారంతో మోదీ విగ్రహాన్ని తయారు చేశామని వెల్లడించాడు.

Advertisement

ఇటీవల ఈ బంగారు విగ్రహాన్ని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. చూపరులను ఈ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొందరు ప్రేక్షకులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×