E-Paper
Advertisement

The Elephant whisperers : ది ఎలిఫెంట్ విష్పరర్స్ డైరెక్టర్‌కు లీగల్ నోటీసులు.. మోసం చేశారని ఆ దంపతుల ఆరోపణ

The Elephant whisperers : ది ఎలిఫెంట్ విష్పరర్స్ డైరెక్టర్‌కు లీగల్ నోటీసులు.. మోసం చేశారని ఆ దంపతుల ఆరోపణ
Advertisement

Bomman and Bellie

Advertisement

The Elephant whisperers : ఆస్కార్‌ విజేత, ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెకు బొమ్మన్‌- బెల్లీ దంపతులు లీగస్‌ నోటీసు పంపించారు. ప్రాజెక్ట్‌ షూట్ చేసే టైమ్‌లో అన్నివిధాలుగా సాయం చేస్తానంటూ కార్తికి మాటిచ్చారని .. ఇప్పటికీ ఆ హామీలను నెరవేర్చలేదని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తమకు ఇల్లు, వాహనం, తమ మనవరాలు చదువుకు కావాల్సిన ఆర్థికసాయంతోపాటు సినిమాలో నటించినందుకు గానూ కలెక్షన్స్‌ నుంచి కొంత మొత్తాన్ని ఇస్తానని కార్తికి తమకు చెప్పారన్నారు. అయితే ఆమె ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.

Advertisement

ఆస్కార్‌ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు సీఎం నుంచి ఆమె పురస్కారాలు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమకు మాత్రం మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను లీగల్‌ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై స్పందించమంటూ ఓ మీడియా సంస్థ బొమ్మన్‌ను సంప్రదించగా.. కేసు కోర్టులో ఉన్నందు వల్ల తాను మాట్లాడాలనుకోవడం లేదని, అవసరం అయితే తమ న్యాయవాదిని సంప్రదించమని తెలిపారు. మ‌రి బొమ్మన్‌, బెల్లీల లీగ‌ల్ నోటీసుపై ది ఎలిఫెంట్ విష్పర‌ర్స్‌ డైరెక్టర్ కార్తికి ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×