E-Paper
Advertisement

Tamilanadu: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం స్టాలిన్

Tamilanadu: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం స్టాలిన్
Advertisement

Tamilanadu: తమిళనాడులో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నై మెరీనా బీచ్‌లో శ్రామికుల విగ్రహం వద్ద గవర్నర్ ఆర్‌ఎన్‌.రవి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌ రవికి సీఎం స్టాలిన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. వీరిద్దరూ ఒకే వేదికపై ఆశీనులయ్యారు.

అయితే కొంతకాలంగా గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్‌కు మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 9న శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠంలో మార్పులు చేసిన కొన్ని పేరాలను చదవకుండా గవర్నర్ వదిలేశారు. గవర్నర్‌ వైఖరిని ఖండిస్తూ సీఎం స్టాలిన్‌ తీర్మానం చేయగా… గవర్నర్‌ సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు.

Advertisement

ఆ తర్వాత రాజ్‌భవన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకలకు కూడా సీఎం స్టాలిన్‌తో పాటు మంత్రులు, డీఎంకే కూటమి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈక్రమంలో సీఎం స్టాలిన్ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరై గవర్నర్ ఆర్ఎన్ రవికి స్వాగతం పలకడం ప్రధాన్యత సంతరించుకుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×