E-Paper
Advertisement

Rahul in Gujarath Elections : జోడో యాత్రకు చిన్న బ్రేక్.. గుజరాత్ ఎన్నికల రణరంగంలోకి రాహుల్

Rahul in Gujarath Elections : జోడో యాత్రకు చిన్న బ్రేక్.. గుజరాత్ ఎన్నికల రణరంగంలోకి రాహుల్
Advertisement

Rahul in Gujarath Elections : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యాత్రకు విరామం ఇచ్చారు. ఎన్నికల ప్రచారం అనంతరం మళ్లీ రాహుల్ జోడో యాత్ర కొనసాగునుంది.

డిసెంబర్ 1న గుజరాత్‌లో తొలి దశ పోలింగ్ జరగనుంది. 5న రెండో దశ పోలింగ్ ఉంటుంది. తొలి ఫేజ్ పోలింగ్‌కు ఇంకా పది రోజుల టైం మాత్రమే ఉండడంతో ప్రచార రంగంలోకి రాహుల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 21, 22 రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ.. గుజరాజ్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు. సూరత్, రాజ్‌కోట్ ఏరియాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. తన ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనున్నారు రాహుల్.

Advertisement

గత 27 ఏండ్లుగా గుజరాత్‌లో బీజేపీదే అధికారం. దీంతో ఈసారి గుజరాత్‌లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. బీజేపీని ఓడించాలని చూస్తోంది. 2017 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 77 అసెంబ్లీ సీట్లు వస్తే, బీజేపీకి 99 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 41శాతం ఓటింగ్ షేర్ చేసుకుంటే.. బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 49. ఓట్ల శాతంలో రెండు పార్టీల మధ్య పెద్దగా తేడా లేదు. ఈసారి ప్రజల మద్దతును గూడగట్టి విజయం సాధించాలని కాంగ్రెస్ చూస్తోంది.

ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ప్రజల సమస్యలు వింటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు రాహుల్. యాత్రలో పార్టీలకు అతీతంగా ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యావంతులు పాల్గొంటున్నారు. దేశ భవిష్యత్తుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 21, 22న విరామం తర్వాత మళ్లీ రాహుల్ యాత్ర మహారాష్ట్రలో ప్రారంభం అవుతుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×